Allగోడ మీద వార్తలు
గోడ మీద వార్తలు

01 . గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతి ని తవ్వి తీసేందుకు సిట్ ను ఏర్పాటు చేసిన – ఆంధ్రా సర్కారు …
లాస్ట్ ఐదేళ్ళ వరకే తవ్వండ్రా సామీ – గునపం ఉంది కదాని మరింత లోతుకి తవ్వితే పాతవి కొత్తగా బయటపడొచ్చు …!!
02. ఏపీలో బయటపడుతున్న ESI స్కాం – మందుల సరఫరా చేయకుండానే బిల్లులు చెల్లించినట్టు వార్తలు …
వీధి వీధికీ పుష్కలంగా ఆ అన్ని రకాల బ్రాండ్ల మందు దొరుకుతున్నప్పుడు ఈ మందులెందుకు అనుకున్నారేమో …!!
03. జగన్ చాలా తప్పులు చేసి ఇరుక్కు పోయారు – ఆయనది రాత్రులు నిద్రలేని పరిస్థితి – చంద్రబాబు …
ఆయన నిత్య జాగరణ చేస్తన్నాడులే సామీ – ఆయన జీవితమో నెవరెండింగ్ శివరాత్రి …!!
04. దేశంలో NRC అమలు చేస్తే దేశంలో 8 కోట్ల మంది పౌరసత్వానికి ముప్పు – ఒవైసీ …
హమ్మయ్య – థాంక్స్ బా – ఎగస్ట్రా కేండేట్లెంత మంది ఉన్నారో సర్వేలు చేసే శ్రమలేకుండా చెప్పేసావ్ …!!
05. స్వగోత్రీకుడ్ని పెళ్ళి చేస్కుందని సొంత కూతురుని గొంతుకోసి చంపేసిన – తండ్రి …
దేశంలో మండలానికో పిచ్చాసుపత్రి కట్టండ్రా సామీ త్వరగా – రోగులు పెరుగుతున్నారు రోజు రోజుకీ .. !!
మరిన్ని వార్తల కోసం – నిత్యం చూస్తూనే ఉండండి – నా గోడ …!!
“ తెలుగు వారందరం తెలుగు లోనే మాట్లాడుకుందాం ”



