సినిమాలు

సినిమా అందరికీ నచ్చుతుందని భావిస్తున్నాను.. వీకెండ్ పార్టీ ఆడియో ఆవిష్కరణలో చంద్రబోస్

నాగార్జున సాగర్ ఏరియాలో జరిగిన నిజ ఘటనల ఆధారంగా వీకెండ్ పార్టీ అనే చిత్రం రాబోతోంది. వీకెండ్ పార్టీ ( A Small Journey) నవలను అమరుడు డాక్టర్ బోయ జంగయ్య రచించారు. బోయ జంగయ్య కుమారుడు బోయ చేతన్ బాబు ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా.. అమరేందర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో ప్రధాన పాత్రగా బాహుబలి ప్రభాకర్, అక్షిత్ అంగీరస, రమ్య రాజ్, రమ్య నాని, సిరి, ప్రియా, గుంటూరు విజయ్, గీతా సింగ్, డిడి శ్రీనివాస్, కిట్టయ్య, హరిశ్చంద్ర, శరత్ కుమార్, నిట్టల, జయ నాయుడు, రమణి సిద్ధి, శ్రీమణి, లలితా రాజు, ప్రధాన పాత్రలో నటించారు. వెంకట్ వేముల ఎడిటర్‌గా, రాము అద్దంకి కెమెరామెన్‌గా, సదా చంద్ర సంగీత సారథ్యంలో తెరకెక్కించిన ఈ మూవీ ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం సోమవారం నాడు ఫిలిం చాంబర్‌లో జరిగింది. ఈ కార్యక్రమానికి సుచిత్ర చంద్రబోస్, చంద్రబోస్, కాసర్లశ్యాం, ప్రముఖ జర్నలిస్ట్‌లు వినాయక రావు, ప్రభు, ‘సంతోషం’ సురేష్ కొండేటి వంటి వారు ముఖ్య అతిథులుగా విచ్చేశారు.

చంద్రబోస్ మాట్లాడుతూ.. ‘సీనియర్ జర్నలిస్ట్‌లు ప్రభు, వినాయకరావు, సురేష్‌ కొండేటి గార్లతో నాకు ఎన్నో ఏళ్ల నుంచి అనుబంధం ఉంది. నా స్పూర్తితో వచ్చిన సదా చంద్ర పాటలు రాయడానికి వచ్చి సంగీతం కూడా అందించేశారు. కాసర్ల శ్యాం నాకు సోదరుడి వంటివాడు. అమర్‌, చేతన్ ఇలా అందరూ నాకు ఆప్తులే. పల్లెటూరి గురించి రాసిన పాట ప్రేక్షకులందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను. నా శ్రీమతి సుచిత్ర ఈ పాటలకు కొరియోగ్రఫీ చేశారు. సినిమా అందరికీ నచ్చుతుందని భావిస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు థాంక్స్’ అని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker