సినిమాలు

సెన్సార్‌ కార్యక్రమాలు పూర్తిచేసుకుని విడుదలకు సిద్ధమైన కిచ్చాసుదీప్‌ హెబ్బులి

సిఎమ్‌బి ప్రొడక్షన్స్‌ బ్యానర్‌ పై ఎమ్‌ మోహన శివకుమార్‌ సమర్పణలో సి.సుబ్రహ్మణ్యం నిర్మించిన చిత్రం హెబ్బులి. ఎస్‌కృష్ణ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. కిచ్చసుదీప్‌, అమలాపాల్‌ నటించిన ఈ చిత్రం కన్నడలో విడుదలై విమర్శకుల నుండి సానుకూల సమీక్షలను అందుకుంది. ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద కమర్షియల్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌గా విజయం సాధించింది. ప్రస్తుతం ఈ చిత్రం తెలుగులో డబ్బింగ్‌ మరియు సెన్సార్‌ కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకుని విడుదల చేయడానికి చిత్ర నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. వి.రవిచంద్రన్‌, పి. రవిశంకర్, కబీర్ దుహన్ సింగ్ మరియు రవి కిషన్ ఈ చిత్రంలో ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమాలో శంకర్, రవి కిషన్, సంపత్ రాజ్ నెగిటివ్ రోల్స్ లో కనిపిస్తున్నారు. ఎ. కరుణాకర్ సినిమాటోగ్రఫీ అందించారు. సౌండ్‌ట్రాక్ మరియు ఫిల్మ్ స్కోర్‌ను అర్జున్ జన్య స్వరపరిచారు.

హెబ్బులిలో ఫ్యామిలీ ఎమోషన్స్, యాక్షన్ సీక్వెన్స్‌లు, రొమాంటిక్ యాంగిల్‌తో కూడిన మంచి కమర్షియల్ ఓరియంటేషన్ కంటెంట్ ఉంది. కన్నడలో విడుదలై బాక్సాఫీసు వద్ద సంచలన వసూళ్లు సాధించిన పక్కా కమర్షియల్ మూవీ. డబ్బింగ్‌ మరియు సెన్సార్‌ కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకుని తెలుగులో ప్రేక్షకులను అలరించేందుకు వస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker