లయన్స్ క్లబ్ ఆఫ్ చేగుంట వెటర్నరీ డిస్టిక్ సెక్రెటరీ లయన్ లింగమూర్తి గారి పుట్టినరోజుసందర్భంగా మూగజీవాలకు చేయూత – ఉచిత పశువైద్య శిబిరం
తూప్రాన్ మండలం నాగులపల్లి గ్రామంలో ఉచిత పశువైద్య శిబిరం

లయన్స్ క్లబ్ ఆఫ్ చేగుంట వెటర్నరీ డిస్టిక్ సెక్రెటరీ లయన్ లింగమూర్తి గారి
పుట్టినరోజుసందర్భంగా మూగజీవాలకు చేయూత – ఉచిత పశువైద్య శిబిరం
చేగుంట నవంబర్ 23 ప్రయత్నం న్యూస్
ప్రతి సంవత్సరం వెటర్నరీ డిస్ట్రిక్ట్ సెక్రటరీ లయన్ లింగమూర్తి గారి యొక్క పుట్టినరోజు సందర్భంగా నిర్వహించే “మూగజీవాలకు చేయూత” కార్యక్రమంలో భాగంగా ఉచిత పశువైద్య శిబిరాన్ని ఒక రోజు ముందుగా
నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి జిల్లా పశువైద్య మరియు పశుసంవర్ధక శాఖ అధికారి (DV&AHO) డాక్టర్ ఆదిత్య వర్మ గారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
పశువులకు వివిధ రకాల పరీక్షలను Dr తిరుపతి AD, Dr గీతా మాలిక మేడం VAS మరియు Dr శ్రీనివాస్ VAS గార్ల ఆధ్వర్యంలో పరీక్షలు నిర్వహించి గర్భకోశ వ్యాధులతో బాధపడుతున్న పశువులకు, ఎదకు రాని పశువులకు మరియు ఇతర వ్యాధి గ్రస్థ పశువులకు కావాల్సిన మందులను ఉచితంగా రైతులకు పంపిణి చేయడం జరిగింది 46 గేదెలు మరియు 24 ఆవులు శిభిరానికి రావడం జరిగింది.మొత్తం 183 పశువులకు 1650 గొర్రెలు మేకల యజమానులకు మందులు ఇవ్వడం జరిగింది.
ఈ సందర్భంగా DV&AHO మాట్లాడుతూ, పుట్టినరోజు వేడుకలను కేవలం వ్యక్తిగత సంబరాలకే పరిమితం చేయకుండా, మూగజీవాల సేవ కోసం ప్రతి సంవత్సరం ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని అన్నారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు సమాజానికి ఎంతో మేలు చేయడమే కాకుండా, ఇతరులకు ఆదర్శంగా నిలుస్తాయని ప్రశంసించారు.
మూగజీవాల ఆరోగ్య పరిరక్షణకు, పశుపోషకుల సంక్షేమానికి ఇలాంటి కార్యక్రమాలు ఎంతో దోహదపడతాయని తెలిపారు.ఈ కార్యక్రమం లో లయన్స్ క్లబ్ ఆఫ్ చేగుంట అధ్యక్షులు రాజనకు రామచంద్రం, డిస్ట్రిక్ట్ చైర్ పర్సన్ దాసోజు వీరబ్రహ్మం, ఆకుల సంజీవ్, రవి VLO, రమేష్ LSA, ప్రభుదాస్ VA,మల్లేష్ VA OS లు జహీదా చిరంజీవి రామకృష్ణ గోపాలమిత్ర సూపరింటెండెంట్ సత్యనారాయణ గోపాలమిత్రలు రామస్వామి అశోక్ శ్రీనివాస్ శేఖర్ మరియు రైతులు పాల్గొన్నారు.


