All

కర్నాల్ పల్లి ప్రాథమిక పాఠశాలలో పెళ్లిరోజు వేడుకలు

పెళ్లిరోజు వేడుకలు బడి పిల్లలకు ప్రత్యేక భోజనాలు

కర్నాల్ పల్లి ప్రాథమిక పాఠశాలలో పెళ్లిరోజు వేడుకలు

 

పెళ్లిరోజు వేడుకలు బడి పిల్లలకు ప్రత్యేక భోజనాలు


చేగుంట నవంబర్ 23 ప్రయత్నం న్యూస్

చేగుంట మండలం కర్నాల్ పల్లి ప్రాథమిక పాఠశాల లో గ్రామానికి చెందిన కుమ్మరి రమేష్ పెళ్లిరోజు సందర్భంగా విద్యార్థులకు ఘనంగా భోజనాలు ఏర్పాటు చేశారు. ఈ భోజనంలో మూడు రకాల కూరలతో కూడిన పోషకాహారంతో పాటు గుడ్డు,అరటిపండు అందజేశారు అంతేకాకుండా విద్యార్థులకు పెన్నులు కూడా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు చిట్టబోయిన సత్యనారాయణ మాట్లాడుతూ గ్రామ పెద్దలు కుమ్మరి రమేష్ గారి పెళ్లి రోజు సందర్భంగా పిల్లలకు మంచి పోషకాహారంతో పాటు మూడు రకాల కూరలతోపాటు గుడ్డు అరటిపండు అందజేశారు చదువుకోవడానికి పెన్నులు కూడా ఇవ్వడం జరిగిందని పిల్లలు మంచి పోషకాహారం తిని బలంగా తయారవ్వాలని, మరియు ఆరోగ్యంగా ఉండి అందరూ బాగా చదువుకోవాలని,మీ తల్లిదండ్రులకు,గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని తెలియజేశారు. ఈరోజు ఈ కార్యక్రమం మొదటిసారిగా పెళ్లి రోజు వేడుక సందర్భంగా పాఠశాల పిల్లలకు భోజనాలు అందించడం జరిగిందని ఈ సాంప్రదాయం ఇలానే కొనసాగాలని, గ్రామ పెద్దలు యువత వీరిని ఆదర్శంగా తీసుకొని మున్ముందు ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని తెలుపుతూ ప్రధానోపాధ్యాయులు సత్యనారాయణ కుమ్మరి రమేష్, జ్యోతి దంపతులకు పెళ్లిరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. వీరి అన్నగారైన కుమ్మరి నర్సింలు గారు కూడా పాఠశాల అభివృద్ధికి పిల్లల సంక్షేమానికి ఎంతో కృషి చేస్తాడని పాఠశాల శ్రేయోభిలాషి అని ప్రధానోపాధ్యాయులు తెలియజేశారు.పాఠశాల ఉపాధ్యాయుడు బాలచందర్ గారు పాఠశాల తరఫున శుభాకాంక్షలు తెలియజేసి మీరు ఇలాగే మా పాఠశాలకు ప్రోత్సాహాన్ని అందిస్తే పిల్లలు మరింత బాగా చదవగలరని చెప్పడం జరిగింది. చివరగా రమేష్ జ్యోతి దంపతులను ఉపాధ్యాయ బృందం వారిని శాలువాతో సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు కుమ్మరి నర్సింలు కుమ్మరి రమేష్ జ్యోతి దంపతులు పాఠశాల ప్రధానోపాధ్యాయులు సత్యనారాయణ ఉపాధ్యాయులు బాలచందర్ సంపత్ కుమార్, వంటవాళ్లు వెంకటమ్మ,విజయ,స్కావెంజర్ జ్యోతి గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker