All

రూ. 2.80 లక్షల క్లోరో హైడ్రేడ్ పట్టివేత.. 56 కేజీల క్లోరో హైడ్రేడ్ స్వాధీనం

కామారెడ్డి నుంచి హైదరాబాద్‌కు కారులో సిహెచ్ తరలింపు జాతీయ రహదారి.. కంది వద్ద ఎన్‌ఫోర్స్‌మెంట్ వాహనాన్ని సీజ్

రూ. 2.80 లక్షల క్లోరో హైడ్రేడ్ పట్టివేత..

56 కేజీల క్లోరో హైడ్రేడ్ స్వాధీనం

కామారెడ్డి నుంచి హైదరాబాద్‌కు కారులో సిహెచ్ తరలింపు

జాతీయ రహదారి.. కంది వద్ద ఎన్‌ఫోర్స్‌మెంట్ వాహనాన్ని సీజ్

ఇద్దరిపై కేసు నమోదు.. ఒకరి అరెస్ట్

కల్తీ కల్లు తయారీకి ఆక్రమార్కులు పక్కదారుల్లో క్లోరో హైడ్రెడ్, ఆల్పోజోలం రవాణ చేస్తూ కల్తీ కల్లు తయారీకి దోహదం చేస్తున్నారు.

ఇలాంటి ఆక్రమార్కుల భరతం పట్టాలని ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ అవినాశ్ మహంతి ఇచ్చిన అదేశాల మేరకు ఎక్సైజ్ శాఖ టీమ్‌లు దాడులను ముమ్మరం చేశారు. ఈ దాడుల్లో భాగంగా శనివారం మెదక్ ఎన్‌ఫోర్స్‌మెంట్ టీమ్ 56 కేజీల క్లోరో హైడ్రెడ్‌ను పట్టుకున్నారు.

వివరాల్లోకి వెళితే..

కల్తీ కల్లు తయారీకి వినియోగించే 56 కేజీల క్లోరో హైడ్రేడ్ (సిహెచ్) ను మెదక్ ఎన్‌ఫోర్స్‌మెంట్ టీమ్ సీఐలు శ్రీనివాస్, బిజ్జానాయక్, ఎస్సై శంకర్‌లు సిబ్బంది కలిసి పట్టుకున్నారు.

కామారెడ్డి నుంచి హైదరాబాద్‌కు మారుతి కారులో ఆక్రమంగా సీహెచ్‌ను తరలిస్తు ఉండగా ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ టీమ్ పట్టుకున్నారు.

ఈ కేసులో 28 కేజీల రెండు క్లోరో హైడ్రెడ్ బ్యాకులను ఎన్‌ఫోర్స్ మెంట్ టీమ్ స్వాధీనం చేసుకున్నారు.

ముందస్తు సమాచారంతో ఎన్‌ఫోర్స్‌మెంట్ జాతీయ రహదారి 161,165 రహదారుల్లో వాహనాల తనిఖీలు ఎన్‌ఫోర్స్‌మెంట్ టీమ్ చేపట్టింది.

కంది గ్రామం వద్ద ఎన్‌ఫోర్స్‌మెంట్ టీమ్ కారును నిలిపి త·నిఖీలు నిర్వహించగా కారులో సీహెచ్ లభ్యమయ్యిందని సీఐ తెలిపారు. కారులో ఉన్న ఉమా కాంత్ గౌడ్ (28)ని అదుపులోకి తీసుకొని విచారించారు.

ఉమాకాంత్‌గౌడ్‌కు బావ అయిన తిప్పారం వెంకట్ గౌడ్ (40) కారులో సీహెచ్‌ను తీసుక వెళ్లి హైదరాబాద్‌లో ఇచ్చి రమ్మని ఇచ్చిన అదేశాల తీసుక వస్తున్నట్లు నిందితుడు ఇచ్చిన సమాచారం మేరకు వెంకట్‌గౌడ్‌పై కూడ కేసు నమోదు చేశారు.
తిప్పారం వెంకట్ గౌడ్ సీహెచ్, ఆల్పోజోలం వ్యాపారం చేస్తున్నట్లు విచారణలో వెల్లడయ్యింది.

పట్టుకున్న క్లోరో హైడ్రెడ్ 56 కేజీల విలువ రూ.2.80 లక్షలుగా ఉంటుందని అంచనా వేశారు.
సీహెచ్‌తోపాటు మారుతి కారును కూడ సీజ్ చేసినట్లు సీఐ శ్రీనివాస్ తెలిపారు.సీహెచ్‌ను, కారును నిందితుడిని సంగారెడ్డి ఎక్సైజ్ స్టేషన్‌లో అప్పగించినట్లు సీఐ తెలిపారు.

సీహెచ్‌ను పట్టుకున్న ఎన్‌ఫోర్స్‌మెంట్ టీమ్‌ను ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ అవినాశ్ మహంతి, జాయింట్ కమిషనర్ అంజన్‌రావు, మెదక్ డిప్యూటి కమిషనర్ ఏ.చెంద్రయ్య, అసిస్టెంట్ కమిషనర్ డి.గాయత్రి అభినందించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker