హైదరాబాద్‌లో ఉగ్రదాడుల హెచ్చరిక.. పోలీసుల హై అలర్ట్!
కాచిగూడ రైల్వే స్టేషన్, హోటల్ టూరిస్ట్ ప్లాజా లక్ష్యంగా బెదిరింపు








హైదరాబాద్‌లో ఉగ్రదాడుల హెచ్చరిక.. పోలీసుల హై అలర్ట్!
కాచిగూడ రైల్వే స్టేషన్, హోటల్ టూరిస్ట్ ప్లాజా లక్ష్యంగా బెదిరింపు
హైదరాబాద్‌లో 26/11 ముంబై ఉగ్రదాడులను పునరావృతం చేస్తామంటూ బెదిరింపు ఈ-మెయిల్ రావడం కలకలం రేపింది. లష్కరే తోయిబా (LeT) పేరుతో వచ్చిన ఈ-మెయిల్‌లో కాచిగూడలోని హోటల్ టూరిస్ట్ ప్లాజా, కాచిగూడ రైల్వే స్టేషన్‌లో బాంబు పేలుళ్లు జరుపుతామని హెచ్చరించినట్లు హైదరాబాద్ పోలీస్ స్పెషల్ బ్రాంచ్ వెల్లడించింది.
ఈ దాడుల్లో కనీసం 300 మందిని హతమార్చడమే లక్ష్యమని ఈ-మెయిల్‌లో పేర్కొన్నట్లు అలర్ట్‌లో వివరించారు. తమ నాయకుడు లతీఫ్ భట్, ఇతర సహచరులను భారత సైన్యం హతమార్చినందుకు ప్రతీకారంగా దాడులకు పాల్పడతామని బెదిరించినట్లు తెలిపారు.
ఈ నేపథ్యంలో హైదరాబాద్ పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. కాచిగూడ రైల్వే స్టేషన్, హోటల్ టూరిస్ట్ ప్లాజా వద్ద భద్రతను కట్టుదిట్టం చేయాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు, హోటళ్లు, ప్రార్థనా మందిరాలు, రద్దీ ప్రాంతాలు, ముఖ్యమైన ప్రభుత్వ సంస్థల వద్ద నిఘా పెంచాలని సూచించారు.
అనుమానాస్పద వ్యక్తులు, నిర్లక్ష్యంగా వదిలివెళ్లిన వస్తువులు, వాహనాలు, అసాధారణ కార్యకలాపాలపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. నిరంతర పెట్రోలింగ్, బాంబు నిరోధక తనిఖీలు చేపట్టడంతో పాటు సంబంధిత భద్రతా విభాగాలతో సమన్వయం చేసుకోవాలని స్పెషల్ బ్రాంచ్ జారీ చేసిన అలర్ట్‌లో పేర్కొంది.



