సోపిరాల గ్రామం ఒకే మాట మీద ఉంటే ఎట్లా ఉంటుందో తెలుసా……. 26వ తారీకు చూస్తారు అందరూ…
మన సర్పంచ్ అభ్యర్థిని గెలిపించుకుని మన గ్రామాన్ని బాగు చేసుకుందాం...... టి ఎస్ ఆర్ ఆంజనేయులు
సోపిరాల గ్రామం ఒకే మాట మీద ఉంటే ఎట్లా ఉంటుందో తెలుసా……. 26వ తారీకు చూస్తారు అందరూ…
హైదరాబాద్ నుండి తరలి వస్తున్నారు మన ఓటర్లు…..
మన సర్పంచ్ అభ్యర్థిని గెలిపించుకుని మన గ్రామాన్ని బాగు చేసుకుందాం…… టి ఎస్ ఆర్ ఆంజనేయులు
ప్రయత్నం న్యూస్ చిన్నగంజాం
ఒకే మాట మీద సోపిరాల గ్రామస్తులు ఉంటే ఎలా ఉంటుందో ఒక్కసారి ఎదుటివారు చూసే విధంగా ఈ ఓటింగ్ జరుగుతుందని అది కూడా 26వ తారీకు మన సోఫియాల గ్రామం చిన్నగంజాం లోని మన ప్రజలు మన ఓటర్లు అందరూ వారి వారి అభిమానాన్ని చూపిస్తారని వీరితో పాటు హైదరాబాదు నుండి మన గ్రామంలో ఓటు ఉన్నవారు ప్రతి ఒక్కరూ బయలుదేరి వస్తున్నారని ప్రతి ఒక్క ఉద్యోగి తప్పకుండా వచ్చి తన ఓటుని ఉపయోగించుకొని వెళ్లాలని 100% ఓటింగ్ పడింది సోపిరాల గ్రామంలో అనిపించుకోవాలని టి ఎస్ ఆర్ ఆంజనేయులు ఈ సందర్భంగా తెలిపారు మంచం గుర్తుకు ఓటేసి మన గ్రామాన్ని బాగు చేసుకుందాం ఇన్ని సంవత్సరాలుగా మనకి కనీసం రిజర్వేషన్ లేకుండా పోయింది ఇప్పుడు మన తోటి ఉంటున్న మనవారికి కొంతమందికి రిజర్వేషన్ వచ్చింది ఆ రిజర్వేషన్ను మనదిగా భావించి మనము చేయవలసిందిగా ఒక్కటే మంచం గుర్తుకు ఓటేస్తే మన గ్రామం బాగుపడట్టే మంచినీటి సౌకర్యం డ్రైనేజీ వ్యవస్థ రోడ్లు పెన్షన్లు మన గ్రామంలో ఇల్లు లేని సొంత స్థలం లేని వారికి ప్రభుత్వం చేత ఒప్పందం చేయించి ఒక ఇంటి స్థలానికి కావలసిన స్థలాన్ని ఇప్పించే విధంగా పోరాటం చేస్తామని ఆయన చెబుతున్నారు ప్రభుత్వం ప్రజల మాట వింటుందని ఆ ప్రజలు ఎన్నుకునే సర్పంచ్ మరియు ఇతర నాయకులు మీదే ప్రభుత్వం ఆధారపడి పని చేస్తుందని ఈ సందర్భంగా ఆయన తెలిపారు సోపిరాల గ్రామం ఒక్కసారి ఒకే మాట మీద ఒకే తాటి పైన ఉంటే ఎలా ఉంటుందో ఒకసారి ఎలక్షన్ కమిషన్ కూడా అదిరిపోయే విధంగా 100% ఓటింగ్ పడాలని ఆయన ఈ సందర్భంగా కోరుతున్నారు సోపిరాల బాగుపడాలంటే మన అభ్యర్థి గెలవాలి ఎవరో కొంతమంది మనవారు పక్కదారి తొక్కేరని వారిని మనం విడిచి పెట్టొద్దు వారు మనవారే కాకపోతే ఎవరి బాధలు ఎవరి సమస్యలు వారికి ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరిని కలుపుకొని పోయి ప్రతి ఒక్కరిని మన వారిగా భావించి మనలో ఒకరిగా భావించి అందరి చేత ఓటు వేయించాలి అందరూ ఓటు వేయాలి 26వ తారీకు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకే ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఎటువంటి పని పెట్టుకోకుండా ఎక్కడికి వెళ్లకుండా ఓటింగ్ 100% అయ్యేటట్టుగా చూడాలని ఆయన ఈ సందర్భంగా కోరుతున్నారు ఆయన కోరికను మన్నించి సోపిరాల గ్రామస్తులందరూ ఒకేసారి పైన రావాలని కోరుకుంటున్నాం




