All
మత్తు కోసం .. పూలకుండీలో గంజాయి మొక్క పెంపకం …
మత్తు అలవాటు పడిన బీటెక్ విద్యార్థి ఇంట్లోనే మొక్కలు పెంచుతూ, బయట నుండి కొనుగోలు చేసి విక్రయిస్తున్నాడు.
మత్తు కోసం .. పూలకుండీలో గంజాయి మొక్క పెంపకం …
గంజాయికి మత్తు అలవాటు పడిన బీటెక్ విద్యార్థి ఇంట్లోనే మొక్కలు పెంచుతూ, బయట నుండి కొనుగోలు చేసి విక్రయిస్తున్నాడు. ఈ మేరకు సమాచారం అందుకున్న మల్కాజ్గిరి ఎస్ఓటి పోలీసులు దాడి చేసి ఇంట్లో పెంచిన గంజాయి మొక్కలను స్వాధీనం చేసుకున్నారు. జవహర్ నగర్ బాలాజీ నగర్ కి చెందిన బిటెక్ విద్యార్థి చిలకల సాయి దినేష్ (22), గంజాయికి బానిసగా మారాడు. పలువురు నుండి గంజాయిని కొనుగోలు చేసి, విక్రయిస్తున్నాడు.ఇదే క్రమంలో ఇంట్లో పులకుండీలో గంజాయి మొక్కలు పెంచుకున్నాడు. సమచారం అందుకున్న పోలీసులు ఇంటి పై దాడి చేయగా సుమారు 4 గ్రాముల పొడి గంజాయి, 2 అడుగుల మేర పెరిగిన గంజాయి మొక్కలను గుర్తించారు. ఈ మేరకు యువకుడు పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

