అధికార ప్రతిపక్షాల పోటాపోటీ ర్యాలీలతో పండుగ సీజన్లో ఆదివారం దిల్లీ వీధులు దద్దరిల్లుతున్నాయి. ఓ పక్క ఇండియా కూటమి పార్టీలు రాంలీలా మైదానంలో భారీ సంఖ్యలో కార్యకర్తలతో ‘ఓట్ బచావో, దేశ్ బచావో’ పేరిట ర్యాలీ చేపట్టాయి. మరోవైపు ‘1984 సిక్కుల ఊచకోత’కు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తూ.. భాజపా శ్రేణులు కౌంటర్ ర్యాలీని చేపట్టాయి. ఈ ఆందోళనకు కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి నాయకత్వం వహించారు. నాడు సిక్కులపై దాడులు పూర్తిగా కుట్రపూరితంగా జరిగిన ఊచకోత అని పేర్కొన్నారు. నాటి అల్లర్ల వేళ తన తల్లిదండ్రులను హిందూ స్నేహితులు ఎలా కాపాడారో వివరించారు. ఈ దాడుల్లో 2,733 మంది సిక్కులు దిల్లీలో ప్రాణాలు కోల్పోయారని తెలిపారు.
ఇక హెడ్‌బ్యాండ్ ధరించి దిల్లీ సీఎం రేఖా గుప్తా, రాష్ట్ర
నాయకులు హర్ష్ మల్హోత్రా, దిల్లీ మంత్రి మంజీందర్ సింగ్ సిర్సా తదితరులు ఈ ర్యాలీలో పాల్గొన్నారు.


