All

కరకగూడెం ప్రభుత్వ ఆయుర్వేద వైద్యురాలు కానరావడం లేదంటూ రోగుల ఆవేదన!

*వారంలో ఒకటి, రెండు రోజులు మాత్రమే విధులకు హాజరవుతున్నారనే ఆరోపణలు *సమావేశాల పేరుతో విధులకు గైర్హాజరు.. స్పందించని సంబంధిత అధికారులు?

కరకగూడెం ప్రభుత్వ ఆయుర్వేద వైద్యురాలు కానరావడం లేదంటూ రోగుల ఆవేదన!

*వారంలో ఒకటి, రెండు రోజులు మాత్రమే విధులకు హాజరవుతున్నారనే ఆరోపణలు

*సమావేశాల పేరుతో విధులకు గైర్హాజరు.. స్పందించని సంబంధిత అధికారులు?

కరకగూడెం, ప్రయత్నం న్యూస్: కరకగూడెం ప్రభుత్వ ఆయుర్వేద ఆసుపత్రిలో వైద్యురాలి విధుల నిర్వహణపై పలు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ ఆయుర్వేద వైద్యురాలు వారంలో కేవలం ఒకటి లేదా రెండు రోజులు మాత్రమే విధులకు హాజరవుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో వైద్యం కోసం ఆసుపత్రికి వచ్చే రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

వైద్యురాలు విధులకు హాజరుకాకపోవడంపై రోగులు ప్రశ్నిస్తే, తనకు అక్కడ సమావేశం ఉంది.. ఇక్కడ సమావేశం ఉంది అంటూ వివిధ కారణాలు చెబుతున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. విధులకు సక్రమంగా హాజరుకాకుండా ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ప్రభుత్వ వైద్య సేవలపై ఆధారపడే పేద ప్రజలకు వైద్యం అందుబాటులో ఉండేలా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ప్రజలు కోరుతున్నారు. ఇప్పటికైనా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు స్పందించి, కరకగూడెం ప్రభుత్వ ఆయుర్వేద ఆసుపత్రి వైద్యురాలి విధుల హాజరుపై సమగ్ర విచారణ చేపట్టి తగిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. మరి సంబంధిత అధికారులు స్పందిస్తారో లేదో వేచి చూడాలి……………………………………………………………………..

సంపటి మధు, కరకగూడెం గ్రామం మాట్లాడుతూ..

“ప్రభుత్వ ఆయుర్వేద ఆసుపత్రికి వైద్యం కోసం, మందుల కోసం వెళ్తే డాక్టర్ గారు ఎప్పుడు వస్తారో ఎవరికీ తెలియని పరిస్థితి నెలకొంది. ఆమెకు ఇష్టం వచ్చినప్పుడు ఆసుపత్రికి వచ్చి, వెళ్ళిపోతూ ఉంటారు. మేము మందుల కోసం ఆసుపత్రికి వచ్చినప్పుడు డాక్టర్ గారు అందుబాటులో ఉండటం లేదు. ఫోన్ చేసి అడిగితే, ఈరోజు నాకు మీటింగ్ ఉంది.. ఆసుపత్రికి రావడం లేదని చెబుతున్నారు.
దీంతో వైద్యం కోసం వచ్చే అందరూ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇకనైనా సంబంధిత ఉన్నతాధికారులు స్పందించి, డాక్టర్ గారు ప్రతిరోజూ నిర్ణీత సమయానికి ఆసుపత్రిలో అందుబాటులో ఉండేలా తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను” అని మధు విజ్ఞప్తి చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker