
రక్షిత్, నక్షత్ర హీరోహీరోయిన్లుగా 1978 ప్రాంతంలో పలాసలో జరిగిన కొన్ని వాస్తవ సంఘటనల నేపథ్యంలో తెరకెక్కిన సినిమా ‘‘పలాస 1978’’ . తమ్మారెడ్డి భరధ్వాజ సమర్పణలో సుధా మీడియా పతాకంపై ధ్యాన్ అట్లూరి నిర్మించిన ఈ మూవీ కరుణ కుమార్దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఈ మూవీ విడుదలకు ముందే ఇండస్ట్రీ లో హాట్ టాపిక్ గా మారింది. సురేష్ ప్రొడక్షన్స్ ద్వారా విడుదలవుతున్న ఈ చిత్రం సెన్సార్ బోర్డ్ మెంబెర్స్ ప్రశంసలు పొందింది.
ఈ సందర్భంగా దర్శకుడు కరుణ కుమార్ మాట్లాడుతూ : ” వాస్తవ ఘటనల ఆధారంగా రూపొందిన మా సినిమాకు ఇక్కడి సెన్సార్ బోర్డ్ చాలా ఎక్కువ కట్స్ సూచించింది. దీంతో రివైజ్ కమీటీ కి వెళ్ళాంల్సి వచ్చింది. అక్కడ” పలాస 1978″ చూసిన సభ్యుల బృందం ఈ సినిమా చాలా బాగుందంటూ ప్రశంసించారు. వారి స్పందన నాకు మరింత బలాన్ని ఇచ్చింది. తెలుగు సినిమా లలో “పలాస 1978″ భిన్న మైనది అండ గా నిలిచిన తమ్మారెడ్డి భరద్వాజ , చిత్రాన్ని విడుదల చేస్తున్న సురేష్ ప్రొడక్షన్స్ అధినేతకు ధన్యవాదాలు తెలిపారాయన.
ఇప్పటికే ఈ సినిమా ప్రమోషన్‌లో భాగంగా విజయవాడ, గుంటూరు ల్లో జరిపిన టూర్స్ కి విశేష స్పందన వచ్చింది. రఘు కుంచె చాలా మంచి మ్యూజిక్ అందించడంతో పాటు చిత్రంలోఓ కీలక పాత్ర ను పోషించడం విశేషం. ఈసినిమాలో శ్రీకాకుళం జానపదం నుండి ’ నీ పక్కన పడ్డాదిరో చూడర పిల్లా..నాది నక్కీ లీసు గొలుసు’ పాట సోషల్ మీడియా లో విశేష ఆదరణ పొందుతోంది అన్నారు…


