Allసినిమాలు

ప‌వ‌న్ సినిమాకి వీళ్ళు హీరోయిన్లా…?


సినిమాల్లో ఒక వెలుగు వెలిగి, ఆ తరువాత ప్రజా సేవ మీద ఉన్నటువంటి మక్కువతో రాజకీయాల్లోకి వచ్చి, ఒక రాజకీయ పార్టీని స్థాపించి, జయాపజయాలతో సంబంధం లేకుండా రాష్ట్రంలోని ప్రజలందరితో కలిసిపోరాడ‌టానికి జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్, ఆంధ్రప్రదేశ్ లో జరిగినటువంటి ఎన్నికల తరువాత ఇకమీదట సినిమాలు చేయబోనని అధికారికంగా ప్రకటించారు. కాగా అభిమానుల కోరిక మేరకు పవన్ కళ్యాణ్ మళ్ళీ సినిమాలు చేయడానికి అంగీకరించారు. కాగా పవన్ తన రీ ఎంట్రీ సినిమాను ఎలాంటి కథ తో చేస్తాడనే అంశం గత కొద్దీ రోజులుగా చర్చనీయాంశంగా మారిందని చెప్పాలి.

 కాగా పవన్ కళ్యాణ్ చేయబోయే సినిమా ఎట్టకేలకు ఖరారయింది. హిందీ లో సూపర్ హిట్ అయిన పింక్ రీమేక్ లో నటించనున్నారని సమాచారం. కాగా ఈ చిత్రానికి తెలుగులో వేణు శ్రీ రామ్ దర్శకత్వం వహిస్తుండగా, దిల్ రాజు, బోని కపూర్ లు ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కాగా ఈ చిత్రానికి ఎస్ ఎస్ థమన్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఇకపోతే ఈ చిత్రంలో ఎవరు హీరోయిన్లుగా నటిస్తున్నారు అనే అంశం ఆసక్తికరంగా మారింది. కాగా ఈ చిత్రంలో మలయాళీ ముద్దుగుమ్మ నివేద థామస్, తెలుగమ్మాయి అంజలి రెండు కీలక పాత్రలు చేయడానికి ఒప్ప్పుకున్నారని, మరొక కీలక పాత్రకు మాతృకలో నటించిన తాప్సిని తీసుకోడానికి ప్రయత్నాలు చేస్తున్నార‌ని సమాచారం. కానీ తదితర వివరాలు అన్ని కూడా అధికారికంగా వెల్లడవ్వాల్సి ఉంది.

ఇక హీరోయిన్ల విష‌యానికి వ‌స్తే అంత పెద్ద క్రేజ్ ఉన్న హీరోన్లు ఎవ‌రూ క‌నిపించ‌డం లేదు. నివేదా థామ‌స్ చూడ‌డానికి బాగానే ఉన్నా అంత పెద్ద హిట్ల‌యితే ఏమీ లేవు. ఇక అంజ‌లి గురించి తెలిసిన విష‌య‌మే. ఈ మ‌ధ్య కాలంలో పెద్దగా సినిమాలు ఏమీ లేవు. ఇక తాప్సీ విష‌యానికి వ‌స్తే ఈ మ‌ధ్య కాలంలో టాలీవుడ్ లో ఆమె సినిమాలు ఏమీ లేవు. బాలీవుడ్ లోనే ఎక్కువ‌గా చేస్తుంది. మ‌రి వీళ్ళ‌ని తీసుకోవ‌డానికి గ‌ల కార‌ణాలేంటో తెలియ‌లేదు. ఏది ఏమైన‌ప్ప‌టికీ ప‌వ‌న్‌కు ఈ చిత్రం మ‌ళ్ళీ రీ ఎంట్రీ లాంటిది. ఇక ఇది ఎలా ఉండ‌బోతుంది  అన్న‌ది తెర మీదే చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker