సాహితీ బాధితులకు కొంత ఊరట లభించినట్లే … !సర్వే నెంబర్ 343లో 24 ఎకరాల భూమి కన్వర్షన్

మూడు సంవత్సరాలుగా సాహితీ బాధితులు పడుతున్న వేదనకు ఊరట లభించే మంచి అవకాశం వచ్చింది అదేంటంటే సాహితీ వెంచర్ 36 ఎకరాల్లో ఇళ్ళు నిర్మిస్తానని చెప్పిన లక్ష్మీనారాయణ సర్వే నెంబర్ 343లో 24 ఎకరాల భూమిని కన్వర్షన్ చేయించుకున్నారు. దీన్ని పూర్తి వివరాలు అమీన్పూర్ తాసిల్దార్ నుండి తీసుకున్న వివరాలను బట్టి ఇప్పటివరకు వ్యవసాయ భూమి పేరిట ఉన్న 24 ఎకరాల భూమి సాహితీ గ్రూప్ వారిదని ఆ భూమిని వ్యవసాయ భూమి నుండి ఇండ్లు నిర్మించుకునే భూమిగా (కన్వర్షన్) సిద్ధంగా ఉంది బాధితులు పడుతున్న మనోవేదనకు డబ్బులు పూర్తిగా చెల్లించి ఏం చేయాలో తెలియక పడుతున్న అవస్థలకు ఈ భూమి 24 ఎకరాలు కన్వర్షన్ చేయడం వలన ఎటువంటి ఇండ్ల నిర్మాణానికి అయినా ప్రభుత్వా అనుమతి లభిస్తుంది. హెచ్ఎండిఏ లో సాహితీవారు వెంచర్ చేయడానికి పెట్టుకున్న దరఖాస్తులు వెనక్కి వచ్చాయి? దీంతో గత మూడేళ్లుగా కట్టడాలు నిర్మించే అవకాశం లేక నో లేకపోతే అసలు నిర్మాణమే చేయకూడదని దృఢ నిశ్చయంతో ఉండి ఉంటారు లేకపోతే సాహితి వారు హెచ్ఎండిఏలో పర్మిషన్ కోసం పెట్టిన ఫైల్ లో అవకతవకలు ఎందుకు ఉంటాయి? అమీన్పూర్ లోని సాహితీ వెంచర్లు ప్లాట్లు తీసుకున్న వారు 24 ఎకరాల ఖాళీ స్థలమును అమ్మి అయినా సరే మా డబ్బులు మాకు చెల్లించమని ప్రభుత్వానికి విన్నపం పెట్టుకోవచ్చు సాహితీ బాధితులంతా ఒక టీం గా ఏర్పడి సిసిఎస్ పోలీసులకు ఫిర్యాదులు చేయడం ఆపై సి ఎస్ ను కలవడం ప్రభుత్వ పెద్దలకు వినతి పత్రాలు ఇస్తూ తమ గోడును వెళ్ళ గట్టుకుంటున్నారు ఈ తరుణంలో భూమి కన్వర్షన్ కావడం ఆ భూమి బాధితులకు ఎక్కడుందో తెలియడం ఎంతో ఉపయోగకరంగా ఉందని చెప్పొచ్చు నిజానికి 343లో ఉన్న ఆ భూమి కొండలతోనూ గుట్టలతోనూ ఉంది ఎవరికి కావలసిన విధంగా వాళ్ళు రాళ్లను మట్టిని తవ్వి తీసుకోవడం వలన ఆ భూమి ఒక సరైన క్రమంలో లేకపోవడం బాధితులకు ఒకింత దానిపై మనసు పడకపోవచ్చు ఏదైతేనేం సాహితీ బాధితులకు ఓదార్పు గా 24 ఎకరాల కన్వర్షన్ భూమి లభించి కొంత ఊరట నిచ్చింది.




