తెలంగాణ

ప్రేమించి పెళ్లి చేసుకున్నారు…. కూతుర్ని అనాధను చేశారు

పెద్దలు కాదన్నా వారిద్దరూ ప్రేమించి ఇష్టపడి పెళ్లి చేసుకొని నగరంలో కాపురం పెట్టారు. నారాయణపేట జిల్లా మక్తల్ మండలానికి చెందిన ఉప్పరి ఆంజనేయులు, కుమారుడు నవీన్ కుమార్ 28 సంవత్సరాలు, ఇంటి పక్కనే ఉన్న భీమేశ్వరి అమ్మాయితో పరిచయం ఏర్పడి పెళ్లికి దారి తీసింది. ఎంతో ఆనందంగా సంతోషంగా ఉంటూ తమకు ఒక బిడ్డ పుడుతుంది .అని మరింత ఆనందంతో ఉన్న ఆ జంటకు దేవుడు సరిగ్గా చూడలేదు. 18వ తేదీ సాయంత్రం 6 గంటల సమయంలో భీమేశ్వరి పురిటి నొప్పులు రావడంతో ఆసుపత్రికి తరలించారు నేరేడుమెట్లోని ఒక ప్రభుత్వ ఆసుపత్రి లో భీమేశ్వరి ఆడపిల్లను ప్రసవించింది తన భర్తకి ఆడపిల్లని చేతికి ఇస్తూ ఎంతో ఆనందించింది ఆనందం కొద్దిసేపటికి మాయమైపోయింది. భీమేశ్వరి అకస్మాత్తుగా మరణించింది, పాపను ఆసుపత్రి వర్గాలు వెంటిలేటర్ పై ఉంచారు. వీరిద్దరిని గాంధీ ఆసుపత్రికి తరలించడంతో వారి  ఇరువురిని చూసి నవీన్ కుమార్ తట్టుకో లేక శుక్రవారం రాత్రి 8 గంటల 55 నిమిషాలకు సంజీవయ్య పార్క్ రైల్వే స్టేషన్ దగ్గర్లో రైలు కింద పడి మరణించాడు బిడ్డ వెంటిలేటర్ పై కొట్టుమిట్టాడుతుంది. తల్లి తండ్రి ఇరువురు లేని ఆ పాపను చూసి ఆసుపత్రిలో చాలామంది కన్నీటి పర్యాయతమవుతున్నారు వారి దగ్గర ఉన్న ఆధార్ కార్డులు తీసుకొని అడ్రస్ తెలుసుకొని వారి తల్లిదండ్రులకు సమాచారం పంపించారు పోలీసులు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker