బి. గోపాల్, సాగర్ల చేతుల మీదుగా విడుదలైన “నా వెంటపడుతున్న చిన్నాడెవడమ్మా” ట్రైలర్..

వి ఆర్ ఫిల్మ్ మేకర్స్ సమర్పణలో రాజధాని ఆర్ట్ మూవీస్ బ్యానర్ పై హుషారు లాంటి సూపర్‌హిట్ చిత్రంలో నటించిన తేజ్ కూరపాటి, అఖిల ఆకర్షణ జంటగా వెంకట్ వందెల దర్శకత్వంలో ముల్లేటి నాగేశ్వరావు నిర్మాణ సారధ్యం లో ముల్లేటి కమలాక్షి, గుబ్బల వేంకటేశ్వరావు లు సంయుక్తంగా నిర్మించిన చిత్రం “నా వెంట పడుతున్న చిన్నాడెవడమ్మా”.ఈ చిత్రం నుండి విడుదలైన అన్ని పాటలకు సంగీత ప్రియుల నుండి అద్భుత మైన రెస్పాన్స్ వచ్చింది.అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని సెప్టెంబర్ 2న గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్న సందర్బంగా చిత్ర ట్రైలర్ ను దర్శకుడు బి. గోపాల్ చిత్ర ట్రైలర్ ను విడుదల చేశారు.ఇంకా ఈ కార్యక్రమంలో దర్శకులు సాగర్ ప్రసన్న కుమార్ , యం. ఆర్. సి. వడ్లపాటి చౌదరి, పద్మిని నాగులపల్లి, మ్యూజిక్ డైరెక్టర్ శశి ప్రీతమ్, ఇండస్రిలిస్ట్ జానకిరామ్ తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ట్రైలర్ విడుదల అనంతరం చిత్ర యూనిట్ ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో
దర్శకుడు బి. గోపాల్ మాట్లాడుతూ..ఈ సినిమా టైటిల్, సాంగ్స్, ట్రైలర్ అన్ని బాగున్నాయి. ఈ సినిమాకు నటీ నటులు, టెక్నిసియన్స్ అందరూ చాలా హార్డ్ వర్క్ చేశారు. ఈ కథ పై ఉన్న నమ్మకంతో దర్శకుడు వెంకట్ చాలా కాన్ఫిడెంట్ గా తీశాడు. అలాగే ఈ సినిమా కథను, దర్శకుడిని నమ్మి తీసిన నిర్మాతలకు ఈ సినిమా బిగ్ హిట్ అవ్వాలి అన్నారు.
ప్రముఖ దర్శకుడు సాగర్ మాట్లాడుతూ..ఈ సినిమాలోని పాటలు బాగున్నాయి.సినిమా కూడా చాలా బాగుంటుంది. ప్రేక్షకులందరూ సెప్టెంబర్ 2 న థియేటర్ కు వచ్చి సినిమా చూసి అశీర్వదించాలని కోరుకుంటున్నాను అన్నారు




