సినిమాలు

సీనియర్ నటులు సుమన్,ఆమని లు విడుదల చేసిన ప్రేక్షకుల మదిని దోచుకునే “మది” ట్రైలర్

ఆర్. వి రెడ్డి సమర్పణలో ప్రగతి పిక్చర్స్ బ్యానర్ పై శ్రీరామ్ నిమ్మల, రిచా జోషి జంటగా నాగ ధనుష్ దర్శకత్వంలో రామ్ కిషన్ నిర్మిస్తున్న సినిమా “మది”. ఆర్వి సినిమాస్ సహనిర్మాతలుగా వ్యవహారిస్తున్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకులని అలరించ బోతుంది.పివిఆర్ రాజా సంగీతం అందిస్తున్నారు. పోస్ట్ ప్రొడక్షన్ కకార్యక్రమాలు పూర్తి చేసుకుని సెన్సార్ జరుపుకుంటున్న సందర్బంగా చిత్ర యూనిట్ ట్రైలర్ లాంచ్ వేడుక ఘనంగా జరుపుకుంది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధితులుగా వచ్చిన సీనియర్ నటుడు సుమన్, నటి ఆమని లు చిత్ర ట్రైలర్ ను విడుదల చేశారు. ఇంకా ఈ కార్యక్రమానికి మండలి శాశన సభ్యులు దయానంద్ గుప్త, కిరణ్, బి. సి. కమీషన్ ఉపేంద్ర, ఫుడ్ కమిషన్ గోవర్ధన్ రెడ్డి, నటి నవీన రెడ్డి, దర్శకుడు జై శంకర్ తదితరులతో పాటు చిత్ర యూనిట్ సభ్యులు పాల్గొన్నారు.

గెస్ట్ గా వచ్చిన సుమన్ గారు మాట్లాడుతూ.. మంచి యూత్ ఫుల్ సబ్జెక్ట్ తో వస్తున్న “మది” సినిమా ట్రైలర్, పాటలు చాలా బాగున్నాయి. దర్శకుడు నాగధనుష్, నిర్మాత రామ్ కిషన్ లిద్దరూ చక్కటి కథను సెలక్ట్ చేసుకొని నేటి యూత్ కు నచ్చేవిధంగా చాలా బాగా తెరకెక్కించారు.ఇందులో హీరో, హీరోయిన్ లు నటన చేస్తుంటే మన పక్కింటి అబ్బాయి, అమ్మాయిలా చాలా బాగా నటించారు. వీరు పడిన కష్టానికి కచ్చితంగా ప్రతి ఫలం లభిస్తుందని ఆశిస్తూ త్వరలో ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ చిత్రం బిగ్ హిట్ అవ్వాలి అన్నారు.

గెస్ట్ గా వచ్చిన ఆమని మాట్లాడుతూ.. “మది” ని దోచేలా ట్రైలర్, పాటలు చాలా బాగున్నాయి. రొమాంటిక్ లవ్ ఎంటర్ టైనర్ సబ్జెక్టు ను దర్శక, నిర్మాతరిద్దరూ చాలాబాగా తెరకెక్కించారు.వీరికి ఎన్ని ఇబ్బందులు ఎదురైనా వెనుకడకుండా ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్న “మది” చిత్రం బిగ్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను అన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker