Allఆంధ్రప్రదేశ్
ఆంధ్రులారా… చంద్రగ్రహణం కావాలా? జగన్మోహనం కావాలా? –పీవీపీ

టీడీపీ అధినేత చంద్రబాబుపై వైసీపీ నేత, సినీ నిర్మాత పీవీపీ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఆంధ్రులారా… చంద్రగ్రహణం కావాలా? జగన్మోహనం కావాలా? అంటూ పీవీపీ ట్వీట్ చేశారు. వృద్ధులకు పెన్షన్‌ను ఇంటికి పంపిస్తున్న ప్రభుత్వం వైఎస్ జగన్ ప్రభుత్వమేనని చెబుతూ, గత ప్రభుత్వం ఉద్యోగులను నిరుద్యోగులుగా మార్చి ఇంటికి పంపిందని పీవీపీ విమర్శలు గుప్పించారు.
ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ పెట్టిన ఆయన, “పెన్షన్ ఇంటికి పంపించే ప్రభుత్వం ఒకటి, ఉద్యోగులను నిరుద్యోగులను చేసి ఇంటికి పంపే ప్రభుత్వం ఇంకొకటి ! మీరే చూజ్ చేసుకోండి. ఆంధ్రులారా, చంద్రగ్రహణమా? లేక జగన్మోహనమా?” అంటూ పీవీపీ ప్రశ్నించారు.



