Allముఖ్యాoశాలువార్తలుసినిమాలు

యాత్రపై విజయమ్మ స్ప ందన?

దివంగత ముఖ్యమంత్రి వైయస్సార్ పాద యాత్ర నేపథ్య ంలో యాత్ర సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. మమ్ముట్టి ప్రధాన పాత్రలో మహి.వి.రాఘవ్ దర్శకత్వ ంలో విజయ్ చిల్లా- శశిదేవిరెడ్డి నిర్మించిన ఈ చిత్రం ఎమోషనల్ ఎంటర్ టైనర్ అన్న టాక్ తెచ్చుకుంది. తాజాగా హైదరాబాద్ ప్రసాద్ లాబ్స్ లో  వైయస్ రాజశేఖర్ రెడ్డి సతీమణి వైయస్ విజయమ్మ ఈ సినిమా ప్రివ్యూని వీక్షించారు. సినిమా వీక్షించిన అనంతరం వైఎస్ విజయమ్మ ప్రశంసల వర్షం కురిపించారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డిని కళ్లకు కట్టినట్టు మరోసారి ప్రజలకు చూపించారని అన్నారు.
విజయమ్మ మాట్లాడుతూ-  రెడ్డి గారి పాదయాత్ర ఆధారంగా తెరకెక్కించిన ఈ సినిమా అద్భుతంగా ఉంది. ఇంత మంచి చిత్రాన్ని రూపొందించిన డైరెక్టర్ మహిరెడ్డికి, చిత్ర బృందానికి అభినందలు. రాజశేఖర్ రెడ్డి వ్యక్తిత్వాన్ని, ఆశయాలను, రాజకీయ జీవితాన్ని.. మరోసారి ప్రజల కళ్లకు కట్టినట్టు చూపారు” అని అన్నారు. ఆనాడు, రాజశేఖర్రెడ్డిని ఆదరించిన ప్రజలు.. ఇప్పుడు ఆయన పిల్లలను కూడా అక్కున చేర్చుకుంటున్నారని విజయమ్మ ఆనందం వ్యక్తం చేశారు. ప్రజలందరికీ దన్యవాదాలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker