తెలంగాణ

భూ సమస్యలపై వందల కొద్దీ కేసులు… ధరణిలో గల్లంతైన హక్కుదారుల పేర్ల నమోదు

 బాధితులున్యాయస్థానాల్లో రోజుకు 200-250 వరకు కేసులు 
33వ మాడ్యూల్‌లో తొలగని చిక్కులుకలెక్టర్లు
 సరిచేసినా ధరణిలో నో అప్‌డేట్‌అర్జీదారుల్లో ఆందోళన.. సీఎస్‌ దృష్టికి సమస్య


.రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం పులిమామిడికి చెందిన ఓ వ్యక్తి రెండెకరాలను కొనుగోలు చేశాడు. ధరణి రాకముందే పట్టాదారు పాస్‌పుస్తకాలు పొందాడు. ధరణి వచ్చాక అమ్మిన వ్యక్తి పేరు రికార్డుల్లో ప్రత్యక్షమైంది. ఆ వ్యక్తేమో పాస్‌పుస్తకం ఆధారంగా ఆ భూమిని మరొకరికి అమ్మాడు. ప్రస్తుతం కొనుగోలు చేసిన వ్యక్తి అధీనంలో భూమి ఉన్నప్పటికీ దీనికి సంబంధించిన హక్కు పత్రాలు లేవు.హైదరాబాద్‌ గచ్చిబౌలికి చెందిన ఓ వ్యక్తి రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి సమీపంలో 3.20 ఎకరాలను కొనుగోలు చేశాడు. ధరణి వచ్చాక ఈ భూమిలో రెండెకరాలకు సంబంధించిన హక్కుపత్రాలు (పట్టాదారు పాస్‌పుస్తకం) సదరు వ్యక్తి పేరున అధికారులు జారీచేశారు. మిగిలిన 1.20 ఎకరాలకు సంబంధించిన పట్టాదారు పాస్‌పుస్తకం శంకర్‌పల్లి గ్రామానికి చెందిన మరో వ్యక్తి పేరున ఇచ్చారు. ఈ భూమికి పట్టాదారు పాస్‌పుస్తకం జారీచేసిన వ్యక్తికి ఎలాంటి సంబంధం లేదు. తనకు జరిగిన అన్యాయాన్ని పరిష్కరించాలంటూ తాజా హక్కుదారు (యజమాని) రంగారెడ్డి జిల్లా రెవెన్యూ అధికారులను (కలెక్టర్‌) ఆశ్రయిస్తే ‘‘మేమేమీ చేయలేం.. ఈ సమస్యను పరిష్కరించేందుకు ధరణిలో మాడ్యూల్‌ లేదు. కోర్టుకు వెళ్లండి’’ అని సమాధానమిచ్చారు. గత్యంతరం లేక సదరు యజమాని,  పాసుపుస్తకం పొందిని వ్యక్తి దగ్గరకి వెళ్లితే రూ.50 లక్షలు ఇస్తేనే మీ భూమికి సంబంధించిన  పట్టాదారు పాస్‌పుస్తకాలు సరెండర్‌ చేస్తానని డిమాండ్‌ చేశాడు. ఇలాంటి సమస్యలతో రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 1.5 లక్షల మంది తాజా భూ హక్కుదారులు ధరణితో ఇబ్బందులు పడుతున్నారు. ధరణిలో జరిగిన తప్పిదంలో తాజా హక్కుదారులకు ధరణిలో పేర్లు నమోదు కాకపోవడంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందజేస్తున్న రైతుబంధు, రైతు బీమా, పీఎం కిసాన్‌ పథకాలు అందడం లేదు. పట్టాదారు పాస్‌బుక్‌ లేని కారణంగా బ్యాంక్‌ రుణం పొందలేకపోతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker