ఆంధ్రప్రదేశ్

ఆగస్టు 1 నుంచి ఉచిత బియ్యాన్ని రేషన్‌ దుకాణాల్లో ప్రతిరోజూ

ప్రధాన మంత్రి గరీబ్‌ కళ్యాణ్‌ అన్న యోజన పథకం కింద ఉచిత బియ్యాన్ని ఆగస్టు 1 నుంచి
రాష్ట్రంలోని రేషన్‌ దుకాణాల ద్వారా 2.68 కోట్ల మందికి ఉచిత బియ్యం పంపిణీ చేయనున్నట్లు
రాష్ట్ర పౌరసరఫరాలశాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు, విద్యాశాఖ మంత్రి
బొత్స సత్యనారాయణ వెల్లడించారు. మంత్రివర్గ ఉపసంఘం సిఫార్సుల మేరకు సిఎం
వైఎస్‌ జగన్‌ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.. ప్రధాన మంత్రి గరీబ్‌ కళ్యాణ్‌ అన్న పథకాన్ని 2020 ఏప్రిల్‌ నుంచి మార్చి
2022 వరకు రాష్ట్రంలో కొనసాగించామన్నారు. రాష్ట్రంలో 4.23 కోట్ల మంది లబ్ధిదారులకు
పిడిఎస్‌ ద్వారా రూపాయి బియ్యం ఇస్తున్నట్లు తెలిపారు. ఇందులో 2.68 కోట్ల మంది ప్రధాన
మంత్రి గరీబ్‌ కళ్యాణ్‌ అన్న యోజన లబ్ధిదారులు కూడా ఉన్నట్లు తెలిపారు.. మంత్రివర్గ ఉప సంఘం సిఫార్సు మేరకు విభజన చట్టంలో
వెనుకబడిన వాటిగా గుర్తించిన రాయలసీమలోని నాలుగు జిల్లాలు, ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాల్లోని 1.67 కోట్ల
మందితో పాటు మిగిలిన పూర్వపు 6 జిల్లాల్లోని 89.20 లక్షల ఎస్‌సి, ఎస్‌టిలకు, 24.60 లక్షల ఎఎవై కార్డుదారులకు
ఈ¸ పథకాన్ని వర్తింపజేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. వీటితోపాటు ప్రకాశం జిల్లాలోని నిరుపేదలకు
కూడా ఈ పథకం వర్తింపజేయాలని నిర్ణయించినట్లు మంత్రులు పేర్కొన్నారు. విశాఖపట్నం, తిరుపతి కార్పొరేషన్లను
మినహాయింపునిస్తున్నట్లు వారు తెలిపారు. ఉచిత బియ్యం సార్‌స్టిక్‌, రూపాయి బియ్యం నాన్‌ సార్‌స్టిక్‌
ఆగస్టు 1 నుంచి ఉచిత బియ్యాన్ని రేషన్‌ దుకాణాల్లో ప్రతిరోజూ మధ్యాహ్నం 3:30 నుంచి పంపిణీ చేయనున్నామని,
ఉచిత బియ్యానికి సంబంధించి మాత్రమే వలంటీర్లు ఈ నెల 31లోపు ఉచిత కూపన్లు పంపిణీ చేయనున్నట్లు మంత్రులు
కారుమూరి నాగేశ్వరరావు, బొత్స సత్యనారాయణ తెలిపారు. రూపాయి బియ్యం మాత్రం సార్‌స్టిక్‌ కాగా, రేషన్‌ దుకాణాల్లో
పంపిణీ చేసే బియ్యం నాన్‌ సార్‌స్టిక్‌ అని పేర్కొన్నారు. రేషన్‌ దుకాణాలను మూసి వేస్తారని కొందరు సోషల్‌ మీడియాలో
ప్రచారం చేస్తున్నారని, ప్రభుత్వం ఒక్క రేషన్‌ షాపునూ మూసివేయడం లేదన్నారు. రాష్ట్రంలోని అర్హులందరికీ పిఎం
జికెఎవై పథకాన్ని వర్తింపజేయాలని ప్రధానికి సిఎం జగన్‌ రెండు లేఖలు రాశారన్నారు. కొత్తగా తమ ప్రభుత్వం 7,051
రేషన్‌ కార్డులు ఇచ్చిందన్నారు. మీడియా సమావేశంలో పౌరసరఫరాలశాఖ కమిషనరు గిరిజా శంకర్‌, కార్పొరేషన్‌ ఎమ్‌డి
వీరపాండ్యన్‌ పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker