వైసీపీ ప్రభుత్వంలో పోలీసులు రోజురోజుకూ దిగజారుతున్నారు……. చంద్రబాబు ట్వీట్

కుప్పం ఘటనపై తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు
వైసీపీ ప్రభుత్వంలో రోజు రోజుకూ పోలీసులు దిగజారుతున్నారని విమర్శించారు. ట్వీట్ చేశారు.
రాష్ట్రంలో బరితెగించిన పోలీసులను డీజీపీ అదుపులో పెట్టాలన్నారు. ఒకప్పుడు దేశంలోనే
పేరున్న ఏపీ పోలీసులు.. ఇప్పుడు వైసీపీ ప్రభుత్వంలో రోజు రోజుకూ దిగజారుతున్నారని విమర్శించారు.
కొందరు పోలీసుల తీరు శాఖకే తలవంపులు తెచ్చిపెడుతోందన్నారు. తప్పు చేసిన పార్లమెంట్ సభ్యులను
సమర్థించే నీచ స్థాయికి కొందరు పోలీసులు వెళ్లడం దారుణమన్నారు. వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ పై చర్యలు
తీసుకోవాలని డిమాండ్ చేస్తూ కుప్పంలో చేపట్టిన నిరసనల సందర్భంగా… దేశాన్ని కాల్చండి అంటూ స్వయంగా
ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ వ్యాఖ్యలు చెయ్యడాన్ని డీజీపీ సమర్థిస్తారేమో గాని ప్రజలు హర్షించరని చంద్రబాబు అన్నారు.
నిందితులకు బహిరంగంగా పోలీసులు మద్దతు పలకడమే కాకుండా… నిరసనలు చేపట్టిన తెలుగుదేశం పార్టీ కుప్పం
నేతలపై అక్రమ కేసులు పెట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానన్నారు. తమపై తప్పుడు కేసులు మాని.. బరి తెగించిన
అధికారులను అదుపులో పెట్టి పోలీసు శాఖ గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత డీజీపీపై ఉందని చంద్రబాబు
ట్విట్టర్లో పేర్కొన్నారు.



