గ్రీన్ ఛానెల్ ఏర్పాటు ద్వారా లైవ్ ఆర్గాన్ రవాణాను సులభతరం చేసిన ట్రాఫిక్ పోలీసులు

ప్రజల విలువైన ప్రాణాలు కాపాడటంలోను, ప్రజలకు సేవ చెయ్యడం లోను ముందుండే హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు అతి తక్కువ సమయం లో లైవ్ ఆర్గాన్ రవాణా చేయుటకు తగిన ఏర్పాట్లు చేసి ఒకరి ప్రాణాన్ని బ్రతికించడంలో మరోసారి తమ ప్రతిభను నిరూపించుకున్నారు. ఈరోజు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు అవయవాన్ని తీసుకువెళుతున్న అంబులెన్స్‌కు ‘నాన్‌స్టాప్ మూవ్‌మెంట్’ అందించడం ద్వారా లైవ్ ఆర్గాన్ (లంగ్స్) రవాణాను సులభతరం చేశారు. రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం శంషాబాద్ నుండి లైవ్ ఆర్గాన్ (లంగ్స్)ని మరియు డాక్టర్స్ బృందాన్ని సికింద్రాబాద్ లోని కిమ్స్ ఆసుపత్రి కి తరలించడానికి హైదరాబాద్ మరియు సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు సమన్వయం చేసుకొని శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి సికింద్రాబాద్‌లోని కిమ్స్ ఆసుపత్రికి రవాణా చేయడానికి గ్రీన్ ఛానెల్‌ని ఏర్పాటు చేశారు. శంషాబాద్ నుండి కిమ్స్ హాస్పిటల్ కు 36. 8 కి.మీ దూరాన్ని కేవలం 25 నిముషాల్లో చేరుకునేలా ఏర్పాట్లు చేసిన హైదరాబాద్ ట్రాఫిక్ జాయింట్ కమీషనర్ ఏ.వి రంగనాథ్ ని కిమ్స్ హాస్పిటల్ యాజమాన్యం ప్రశంసించింది మరియు నగర ప్రజల ప్రశంసలు కూడా పోలీసులు అందుకున్నారు. ఈ ఏడాది 2022లో హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు 25 సార్లు అవయవ రవాణాను సులభతరం చేశారు. హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు మన పౌరుల పట్ల ఎంతో శ్రద్ధ వహించి విధులు నిర్వహిస్తారు అనడం లో అతిశయోక్తి లేదు.




