ఆంధ్రప్రదేశ్తెలంగాణముఖ్యాoశాలు
కాపు ప్రముఖులకు సన్మాన కార్యక్రమం మరియు విద్యార్థులకు స్కాలర్ షిప్ పంపిణీ

హెచ్ . కె.ఎస్ , తెలంగాణ కాపు సంఘం హైదరాబాద్ వారి ఆధ్వర్యంలో శ్రీ రాజరాజేశ్వరీ గార్డెన్లో వివిధ రంగాలలో సేవలు చేసినటువంటి కాపు ప్రముఖులకు సన్మాన కార్యక్రమం మరియు విద్యార్థులకు స్కాలర్ షిప్ లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ మున్నూరు కాపు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కొండ దేవయ్య పాల్గొని వివిధ రంగాలలో సేవలు అందించిన వారికి సేవా ధీర ప్రశంస పత్రం మరియు ఉత్తమ సేవ పురస్కారం మెమొంటో లను అందజేశారు.
అందులో భాగంగా మీడియా రంగానికి కాపు కులానికి విశిష్ట సేవలు అందిస్తున్న కొత్త లక్ష్మణ్ పటేల్ గారికి మీడియా సేవా ధీర ప్రశంస పత్రం మరియు ఉత్తమ సేవ పురస్కారం మెమొంటో ,అలాగే వైద్య రంగంలో పి ఎల్ ఎన్ పటేల్ గారికి వైద్య సేవా దీర ,వ్యాపార సేవ దీర ఆలపాటి లక్ష్మీనారాయణ గారికి అన్ని రంగాల్లో లో ప్రముఖులను మాజీ కలెక్టర్ బి లక్ష్మీకాంతం ఐఏఎస్ మరియు వంగవీటి నరేంద్ర గార్ల తో కలిసి ఘనంగా సన్మానించారు .ఈ సందర్భంగా కొండ దేవయ్య గారు మాట్లాడుతూ వివిధ రంగాలలో సేవలు చేస్తున్నటువంటి కాపులను గుర్తించి వారికి సన్మానం చేయడం చాలా సంతోషంగా ఉందని దీని ద్వారా వారు మరిన్ని సేవా కార్యక్రమాలు చేయడానికి తోడ్పడుతుందని అలాగే నాకు కాపు కుల సేవ ధీర అవార్డును ప్రధానం చేయడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు .ఈ కార్యక్రమ నిర్వాహకులు ఆకుల రమణ మూర్తి గారికి , సత్య శేఖర్ గారికి , యేసు బాబు గారికి, అడపా భాస్కర్ గారికి ప్రత్యేక ధన్యవాదములు తెలియజేశారు.
ఈ కార్యక్రమానికి ప్రముఖ వైద్యులు చెన్నంశెట్టి విజయ్ కుమార్, కాసారం రమేష్, ప్రముఖ మెజీషియన్ సామల వేణు,అవార్డు గ్రహీతలు డాక్టర్లు, లాయర్లు,వ్యాపారవేత్తలు,కుల సంఘ ప్రముఖులు మరియు జంట నగరాల్లో ఉన్న మున్నూరు కాపు, కాపు సంఘాల సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు


