స్విమ్స్ అభివృద్ధికి చర్యలు : టిటిడి చైర్మన్

దేశంలోనే అత్యున్నత వైద్య విజ్ఞాన సంస్థగా స్విమ్స్ని తీర్చిదిత్దుతామని, ఇందుకు టీటీడీ నుంచి సంపూర్ణ సహకారమందిస్తామని చెప్పారు ధర్మకర్తల మండలి అధ్యక్షులు వైవీ సుబ్బారెడ్డి తెలియజేశారు.
వెలగపూడిలోని సచివాలయంలో ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నానితో కలిసి స్విమ్స్ అభివృద్ధికి ప్రభుత్వ పరంగా తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షించిన అనంతరం ఆయన మీడియాలో మాట్లాడుతూ రాజధాని ప్రాంతానికి త్వరలో ఎయిమ్స్ రాబోతోందని, ఇది మూడు జిల్లాల ప్రజల అవసరాలు తీరుస్తుందని, ఉత్తరాంధ్రలో కింగ్‌జార్జి ఆస్పత్రి సేవలందిస్తున్నట్లే రాయలసీమ ప్రజలకు స్విమ్స్ తలమానికంగా నిలిచేలా రూపొందిస్తామని చెప్పారు.
ఈ సమావేశంలో స్విమ్స్‌ను అన్ని విధాలా అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం అందిస్తామని ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని హామీ ఇచ్చారని, ఈ ఆసుపత్రికి కార్డియాలజీతోపాటు గ్యాస్త్రో ఎంట్రాలజీకి సంబంధించిన అత్యాధునిక పరికరాల కొనుగోలుపై చర్చించామన్నారు. అలాగే ఉద్యోగుల పదోన్నతులు, ఆర్థిక సౌకర్యాల పెంపు గురించి సమీక్షించినట్టు వివరించారు
ఈ సమావేశంలో తుడా చైర్మన్ చెవిరెడ్డి భాస్కరరెడ్డి, వైద్య ఆరోగ్య ముఖ్య కార్యదర్శి కేఎస్ జవహర్, తిరుపతి జేఈఓ బసంత్ కుమార్, స్విమ్స్ డైరెక్టర్ వెంగమ్మ , ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.




