
రాష్ట్ర చిరంజీవి యువత వర్కింగ్ ప్రెసిడెంట్ గా పనిచేస్తున్న తైక్వాండో శ్రీను కు శ్రీకాకుళం జిల్లాలలో అధిక రక్తదాన శిబిరాలు నిర్వహించినందుకు జిల్లా స్ధాయి సేవా పురస్కారం అందింది. 71వ భారత గణతంత్ర దినోత్సవ వేడుకల్లో…జిల్లా కలెక్టర్ జె నివాస్ , జిల్లా ఎస్పీ అమ్మి రెడ్డి లు శ్రీనుకు ఈ జిల్లాస్థాయి అవార్డు.., ప్రశంసాపత్రం ను ఆయనకు ప్రధానం చేశారు.
తనని ఈ పురస్కారంకి ఎంపిక చేయటంపై తైక్వాండో శ్రీను హర్షం వ్యక్తం చేస్తూ, మెగా ఫ్యామిలీ అభిమానులతో… జిల్లా రెడ్క్రాస్ ద్వారా రెడ్ క్రాస్ రక్తనిధి కి, పెద్ద ఎత్తున రక్తం సమకూర్చటం ఆనందంగా ఉందని, ఈ ఏడాది కూడా అత్యధిక రక్తదాన శిబిరాలు నిర్వహించడం తో పాటు పాలు సేవా కార్యక్రమాలు చేస్తామని అన్నారు. తన అవార్డు మెగా అభిమానులకు అంకితమని ఈ సందర్భంగా తైక్వాండో శ్రీను చెప్పారు.




