తెలంగాణ
బాధ్యతలు లేవు ….బాధలు లేవు! ప్రజా ప్రతినిధులది….. అధికారుల ది ఒకే బాట!
డబ్బులు చేతపట్టుకుని ఏ నాయకుడైనా వస్తువులు కొన్నారా.... అధికారులు ఎవరైనా మార్కెట్లో రేట్లు ఎలా ఉన్నాయి అని ఎప్పుడైనా తెలుసుకున్నారా లేదు వీరికి తెలియదు వీరు ఇరువురికి బాధ లేదు బాధ్యత లేదు ప్రజలను పీక్కు తినడం ఒక్కటే వీరికి తెలిసిన పద్ధతి అది ఎలా అంటారా మనది ప్రజాస్వామ్య వ్యవస్థ ప్రజాస్వామ్యంలో ఎన్నుకోబడి నాయకులు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకొని తద్వారా వారి పరిపాలన సాగిస్తారు వీరితో పాటు వీరి కింద పని చేయడానికి అధికారులు ప్రజాప్రతినిధులు అధికారులు ఒకే గూడు కింద పని చేస్తారు అందుకే వారికి బాధలు లేవు బాధ్యతలు లేవు వీరికి ప్రత్యేకంగా మరో సదుపాయం ఉంది మార్కెట్ కి వెళ్లి గాని వస్తువులు కొనడం లేదా డబ్బులు వారికి చెల్లించడం ఆ డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలియకుండా ఖర్చు చేయడం అధికారంలో ఉన్న ఐదు సంవత్సరాలు ప్రజాప్రతినిధి ప్రజలను పీకుతుంటే 30 సంవత్సరాలు అధికారులు నెమ్మదిగా పీక్కు తింటారు వీరు ఇరువురిలో ఎవరైనా సరే ప్రజల పైన ఆధారపడి బతకాల్సింది సామాన్య ప్రజలు కష్టపడి చెమటోడ్చి ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎన్నెన్నో వ్యవస్థలతో పోటీపడి అవస్థపడి ఉద్యోగ బాధ్యతలను వేధిస్తూ కుటుంబాన్ని పోషించుకుంటూ ప్రభుత్వనీ పోషిస్తూ తన జీవిత ప్రయాణాన్ని ముందుకు సాగిస్తారు గత పది సంవత్సరాల క్రితం ఉన్న రేట్లు ఎట్లున్నాయి ఇప్పుడు మార్కెట్లో రేట్లు ఎలా ఉన్నాయి ఇది కాకుండా ఆర్టీసీ చార్జీలు ఫోన్ బిల్లులు కరెంటు బిల్లు మున్సిపల్ టాక్స్ అన్ని ఆ సామాన్యుడు కష్టం చేసి కట్టుకోవాల్సిందే కానీ రాజకీయ నాయకుడు గాని అధికారి గాని వారు ప్రజలు కట్టిన సొమ్మును జీతాల రూపంలో తీసుకుని వారి పైనే పనులు వేసి చలానాలు వేసి వారి దగ్గర నుంచి మరింత సొమ్ము ను తీసుకుంటారు నాయకున్ని గాని అధికారులను గాని ప్రభుత్వాన్ని కానీ సామాన్య ప్రజలే కష్టం చేసి బతికిచ్చా లి అలాంటప్పుడు ముఖ్యమంత్రికి మంత్రులకు ఎమ్మెల్యేలకు ప్రజాప్రతినిధులకు జీతాలు ఎందుకు ఓట్లు కొనడం పదవులను కొనడం వ్యవస్థలను కొనడం చేస్తున్న ఈ రాజకీయ నాయకులు ప్రజల సొమ్మును ఏదో ఒక రూపంలో తీసుకొని వారికి వందనాలు పెడుతున్నారు. పోలీసు వ్యవస్థ రెవిన్యూ వ్యవస్థ జ్యుడీషియరీ వ్యవస్థ : ఆ వ్యవస్థలో పనిచేసే అధికారులను చిన్నచిన్న ఉద్యోగులను ప్రజలే ఆదుకోవాలి ఎలాగంటే లంచాల రూపంలో తీసుకోవడం అధికారుల వంతు అదే పోలీసు అయితే చలానాల రూపంలో తీసుకోవడం మరో పద్ధతి అలాగే ప్రభుత్వం జీఎస్టీ సి ఎస్ టి టాక్స్ ఇంటి పన్ను రోడ్డు పన్ను వాటర్ బిల్లు వీటన్నిటికీ సంబంధించిన డబ్బులను ప్రతి నెల క్రమం తప్పకుండా వసూలు చేసి వారు తింటూ వాటిని ప్రభుత్వాలు వారి తండ్రిగారి పేరు మీదను తాతగారి పేరు మీద మనవడు గారి పేరు మీద ఎన్నో రకాల పథకాలు సృష్టించి ఆ పథకాలన్నీ వారు స్వయంగా వారి జేబు నుంచి ఇస్తున్నట్టుగా ఫీల్ అవుతూ మైకుల్లో వాట్సాప్ లో ట్విట్టర్లలో అనేక రకాలుగా అధికారులకు ప్రజలకు తెలిసే విధంగా సమాచారాలు పంపుతుంటారు ప్రజల సొమ్ముతిని ప్రజలనే కొడుతూ వారికి గౌరవం లేకుండా చేస్తూ రోజుకు ఒక రకమైన మాటలతో చేష్టలతో ప్రజలను విసిగిస్తూ ప్రభుత్వాలు ముందుకు సాగుతున్నాయి




