
పూరి జగన్నాథ్ వారసుడు ఆకాష్ పూరి ప్రస్తుతం రెండో సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. రొమాంటిక్ అనేది టైటిల్. అనీల్ పాడూరి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాని పూరి జగన్నాథ్ – ఛార్మి కౌర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా ప్రస్తుతం గోవాలో తెరకెక్కుతోంది. ఆకాష్ సరసన నటించే కథానాయిక ఎవరు? అంటే .. దిల్లీకి చెందిన కేతిక శర్మను ఫైనల్ చేశారని తెలుస్తోంది. కేతిక టాప్ మోడల్. ఇన్ స్టాగ్రమ్ లో 10లక్షల (ఒక మిలియన్) అనుచరులు ఉన్న సెన్సేషనల్ గాళ్. డబ్ స్మాష్ లతో పాపులరైంది. తొలిసారి వెండితెరపై అదృష్టం పరీక్షించుకోనుంది.




