ఆంధ్రప్రదేశ్ముఖ్యాoశాలు
కేంద్రం ఇచ్చిన హామీలను వెల్లడించిన మంత్రి విడదల రజిని

ఏపీలో మెడికల్ కాలేజ్ ఏర్పాటుకు కేంద్రం సహకరించాలని కోరినట్లు ఏపీ వైద్య శాఖ మంత్రి విడదల రజిని వెల్లడించారు. కేంద్రమంత్రి అన్ని సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారని ఆమె తెలిపారు. రాష్ట్రంలో ప్రవేశపెట్టిన సచివాలయం, విలేజ్ క్లినిక్ కాన్సెప్ట్‌ను కేంద్ర మంత్రి ప్రశంసించారని పేర్కొన్నారు. ఈ అంశాన్ని కేంద్ర క్యాబినెట్లో చర్చిస్తామన్నారని చెప్పినట్లు పేర్కొన్నారు. అలాగే ప్రధాని మోడీకి సైతం దీనిని చూపేందుకు ఏపీకి తీసుకొస్తానని హామీ ఇచ్చారని తెలిపారు.




