ఆంధ్రప్రదేశ్ముఖ్యాoశాలు
తిరుమల తిరుపతి దర్శనాల టిక్కెట్లు కుంభకోణంలో బుధాటి లక్ష్మీనారాయణ…….జనసేన నాయకులు

ఒక పుణ్యక్షేత్రానికి బోర్డు మెంబర్ గా ఉంటూ ఆ పుణ్యక్షేత్రంలో దర్శనం టికెట్లు అమ్ముకొని, ఆ దర్శనం టికెట్లు తీసుకున్న వారికి, తన దగ్గర ప్లాట్లు ఉన్నాయని, వాటిని తక్కువ ధరకి ఇస్తానని, మాయమాటలు చెప్పి దాదాపు 1000 మందిని పక్కాగా మోసం చేసిన, బుధాటి లక్ష్మీనారాయణ ఎక్కడున్నాడో తెలియక ఆయన బాధితులు బోరున విలపిస్తున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం పవిత్రతను కాపాడాల్సిన ఒక బోర్డు మెంబర్ ,స్వామివారికి కళంకం తెచ్చే విధంగా ప్రవర్తించడం వెనుక ముఖ్యమంత్రి జగన్ ప్రమేయం ఎంతో ఉందని, జనసేన నాయకులు ప్రశ్నిస్తున్నారు. పవిత్ర పుణ్యక్షేత్రంలో దొంగని తీసుకొచ్చి అతని దగ్గర డబ్బులు తీసుకొని పదవికి కట్టబెట్టడం వెనుక ఆంతర్యం ఏంటని జనసేన నాయకులు ప్రశ్నిస్తున్నారు,. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 5వేల మందికి పైగా సొంత ఇంటి కల నెరవేర్చుకుందామనుకున్నా వారి కల చెదరగొట్టి వేల కోట్ల రూపాయలు దాచుకొని విదేశాలకు పారిపోవాలని చూస్తున్నాడని, బాధితులు ఆరోపిస్తున్నారు. కేసులు పెడితే పోలీసులు స్పందించకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. భూమి లేకుండానే గుంటూరు జిల్లా మంగళగిరి వద్ద ,కాజా అనే గ్రామంలో దాదాపు 1000 కి పైగా ప్రజలను ఫ్రీ లాంచ్ పేరుతో ఇల్లు నిర్మిస్తానని ,డబ్బులు తీసుకొని ముఖం సాటేసి తాను చేస్తున్న వెంచర్లు అంటూ, కలర్ పేపర్లు చూపించి సమయం దాటేస్తూ వస్తున్నాడని, బాధితులు వాపోతున్నారు. తెలంగాణలో 2019 సంవత్సరంలో ఫ్రీ లాంచ్ ప్రారంభించి 2019 డిసెంబర్ వరకు పూర్తిచేసుకుని తన దగ్గర ఉన్న ఫ్రీ లాంచ్ వ్యవహారంలో పనిచేసిన ఉద్యోగులను వేరే మరో రియల్ ఎస్టేట్ కు పంపించి చేతులు దులిపేసుకున్నాడు. తన కుటుంబం పేరుతో 48 కంపెనీలు ఏర్పాటు చేసి, వసూలు చేసిన 1500 కోట్లు ఏ కంపెనీలకు పంపించాడో తెలియదు, కానీ పక్కా ప్రణాళికతో ప్రజలను మోసం చేయాలని ఉద్దేశంతోనే కంపెనీలు ప్రారంభించి, ప్రజలకు చుక్కలు చూపించాడు, అయినా గాని ఏపీలో జగన్, తెలంగాణలో కెసిఆర్, ఎన్ని డబ్బులు తీసుకుని పోలీసులు నుండి అతనికి రక్షణ కల్పిస్తున్నారు. చిన్న దొంగతనం చేసిన వ్యక్తిని గొలుసులు కట్టి మరీ తీసుకువెళ్లే పోలీసులు, ఆర్థిక నేరగాన్ని ₹2,000 పైగా మందిని మోసం చేశాడని తెలిసినప్పటికీ, ఎటువంటి చర్యలు తీసుకోకుండా, నిమ్మకు నీరు ఎత్తినట్టు కూర్చోవడం. ఈ ముఖ్యమంత్రులకు అలవాటైపోయింది అంటున్నారు బాధితులు. ప్రతి రూపాయి పోగేసి ఫ్రీ లాంచ్ పేరుతో మా దగ్గర నుంచి డబ్బులు కట్టించుకొని డబ్బులు ఇవ్వమంటే ఇస్తానంటూ కాలక్షేపం చేస్తూ సమయం దాటవేస్తూ ఫోన్ తీయకుండా ఇబ్బంది పెడుతూ ,పైగా అడగడానికి వెళ్లిన వ్యక్తులను వెళ్లిన వ్యక్తులను బెదిరించడం, కూడా జరుగుతుందని బాధితులు వాపోతున్నారు .మంత్రులు మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అందరూ ఎక్కడికి పోయారు ఓట్లు అడిగే సమయంలో కష్టాలు తీరుస్తామంటూ చెప్పిన నాయకులు కనపడకుండా పోయి కనీసం తప్పు చేసిన వ్యక్తిని ప్రశ్నించడానికి కూడా ముందుకు రాని ఈ పార్టీలో నాయకులు ఎందుకు అని బాధితులు కడుపు మంటతో రగిలిపోతున్నరు.



