తెలంగాణ
వీఆర్ఏల సమ్మె విరమించేదెప్పుడు .? రెవెన్యూ సమస్య లు తీర్చేదెప్పుడు .?

వీఆర్వోలను రెవిన్యూ నుండి తప్పించారు వీఆర్ఏల సమస్యలు తీర్చడం లేదు..... 37 రోజులుగా పఠాన్ చెరు మండల పరిధిలో పనిచేస్తున్న వీఆర్ఏలు ముకుమ్మడిగా దీక్షలు చేస్తూ సొమ్మసిల్లి పడిపోయే పరిస్థితి వచ్చినా వెనకాడకుండా పోరాటం సాగిస్తూనే ఉన్నారు. అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి చేసిన వాగ్దానాలు, నెరవేర్చకుండా కాలం వెళ్లబుచ్చటంతో వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వీఆర్ఏల నుపే స్కేల్ ఎంప్లాయిస్ గా చేస్తానని, వారికి పూర్తి భద్రత కల్పిస్తానని ముఖ్యమంత్రి ఇచ్చిన మాటలు నిలబెట్టుకోవాలని వారు నిరవధిక నిరాహార దీక్షలకు పూనుకున్నారు. వీఆర్ఏల సమస్యల పరిష్కారం కోసం గత 37 రోజులుగా వీఆర్ఏలు దీక్షలు చేస్తున్నారు వారికి వివిధ సంఘాల నేతలు ప్రజాప్రతినిధులు సంఘీభావం తెలుపుతున్నారు వీఆర్ఏల సమస్యలపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలని వారు కోరుతున్నారు ఎంతో కష్టపడి పనిచేసే వీఆర్ఏల న్యాయమైన కోర్కెలు తీర్చడంలో ప్రభుత్వం మీనమేషాలు లెక్కపెడుతుందని వీఆర్ఏలు చెబుతున్నారు ప్రభుత్వం అధికారులు అందరు కలిసి తమ సమస్యలను పరిష్కరించే విధంగా చూడాలని వారు మొరపెట్టుకుంటున్నారు. తాసిల్దార్ కార్యాలయంలోను , ఆర్డీవో కార్యాలయంలోని వీఆర్ఏల అవసరం ఎంతైనా ఉంది ప్రభుత్వం తమ సమస్యల పరిష్కారానికి వీఆర్ఏలకు అసెంబ్లీ సాక్షిగా ప్రకటించిన హామీలను నెరవేర్చే వరకు సమ్మె విరమించబోమని వీఆర్ఏల సంఘం నాయకులు గట్టిగా చెబుతున్నారు తెలంగాణలోని అన్ని జిల్లాలు మండలాలను కూడా వీఆర్ఏల అవసరం ఉన్నట్టు స్పష్టంగా కనిపిస్తుంది వీఆర్ఏలు ప్రజలకు కావలసిన అన్ని సౌకర్యాలను అందిస్తూ అధికారులకు చేదోడువాదోడుగా ఉంటున్న వారికి సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీని వారు గుర్తు చేస్తూ తమ సమస్యల పరిష్కారానికి అందరూ కలిసికట్టుగా రావాలని చెబుతున్నారు తెలంగాణలోని రెవెన్యూ అసోసియేషన్ సంబంధించి ఉద్యోగులందరూ ఒక్కతాటిపై నిలిస్తేనే వీఆర్ఏల సమస్యలు తీరుతాయని వారు కన్నీటి పర్యంతమవుతున్నారు ఉదయం నుండి సాయంత్రం వరకు దీక్ష శిబిరంలో కూర్చొని తమ నిరసన తెలియజేస్తున్నారు తాసిల్దార్ కార్యాలయాల్లోకి వచ్చిపోయే ప్రజలకు ఎటువంటి పనులు కాకుండా ఉండడంతో వారు మండల ఆఫీస్ కు వచ్చి పనులు కాక పోవడంతో నిరాశతో తిరిగి వెళ్తున్నారు. వి ఆర్ ఏల అవసరం ఎంతో ఉందని ఇకనైనా రాష్ట్ర ప్రభుత్వం వి ఆర్ ఏ ల సమస్యలు పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు.




