ఆంధ్రప్రదేశ్

జగన్ పర్యటన వల్ల ఒరిగింది ఏమిటి … ప్రభుత్వం సోమ్ము మాత్రం ఖర్చు చేయడానికితప్ప …….చంద్రబాబు

తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల భారీ వర్షాలు కురిశాయి. దీంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి.
వాగులు, వంకలు పొంగిపొర్లాయి. ఇక ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాల వల్ల గోదావరి , కృష్ణా నదులకు భారీగా
 వరద ప్రవాహం చేరింది. దీంతో ఆయా నదీ పరివాహక ప్రాంతాల్లో వరదలు వచ్చాయి. పలు ప్రాంతాల్లో ఇళ్లలోకి నీళ్లు
 చేరాయి. రోడ్లపై భారీగా వరద నీరు నిలిచిపోయాయి. పంట పొలాల్లో నీరు చేరడం వల్ల భారీగా నష్టం వాటిల్లింది
. ప్రధానంగా ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో వరదలు బీభత్సం సృష్టించాయి. ముఖ్యంగా ఏపీలో విలీనం
అయిన మండలాల్లో పంట, ఆస్తి నష్టం తీవ్ర స్థాయిలో జరిగింది. దీంతో సీఎం జగన్ ఆయా గ్రామాల్లో పర్యటించారు.
వరద ప్రాంతాలను పరిశీలించారు. వరద బాధితులను పరామర్శించారు. అయితే తాజాగా ప్రతిపక్ష నేత చంద్రబాబు
  పర్యటిస్తున్నారు. వరద బాధితులను పరామర్శిస్తున్నారు. ఈ నె 21, 22న చంద్రబాబు ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో పర్యటించారు. కోనసీమ జిల్లా పి.గన్నవరం, రాజోలు, పాలకొల్లు, ఆచంటలో వరద బాధితులను పరామర్శించారు. వరద బాధితులకు అండగా ఉంటామని చంద్రబాబు హామీ ఇచ్చారు.ఈ నేపథ్యంలో ‘‘వరద ప్రాంతాల్లో సీఎం జగన్ పర్యటన ఎలాంటి ప్రభావాన్ని చూపింది. ప్రతిపక్ష నేత పరామర్శలు వరద బాధితులు పరామర్శించేందుకు సీఎం వైఎస్ జగన్ పశ్చిమగోదావరి తూర్పుగోదావరి జిల్లాలో జరిగిన నష్టాన్ని అంచనా వేస్తూ ఆ అంచనాలు కాగితాలకే పరిమితం అయ్యేట్లు ఎదురుచూసిన ప్రజలకు నిరాశ మిగిలినట్లు అయింది. అసలు జగన్ పర్యటన వల్ల ఒరిగింది ఏంది అనేది ఆలోచిస్తే ప్రభుత్వం జగన్ పర్యటనకు అయ్యే ఖర్చు మాత్రం ఖర్చు చేయడానికి వచ్చినట్టు అనిపిస్తుందిఇంతకూ యాత్రలతో మోతెక్కుతున్న వరద ప్రాంతాలు కోలుకున్నాయా?. వరద బాధితులను ఊరడించాయా?. జగన్ పర్యటనలో వరద బాధితులకు ఏమైనా ఒరిగిందా?. తనది మానవత్వం కలిగిన ప్రభుత్వం అని జగన్ ఎందుకు చెప్పుకుంటున్నారు?.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker