Allసినిమాలు

‘వరల్డ్ ఫేమస్ లవర్’ ‘మై లవ్’ సాంగ్ రిలీజ్‌

లవర్స్ డే కానుకగా ఫిబ్రవరి 14న  విడుద‌ల కానున్న ‘వరల్డ్ ఫేమస్ లవర్’  నుండి ‘మై లవ్’ అనే రొమాంటిక్ మెలోడియస్ సాంగ్ ని యూట్యూబ్ లో రిలీజ్ చేసారు నిర్మాత‌లు మ్యూజిక్ డైరెక్టర్ గోపి సుందర్ స్వరపరిచిన ఈ పాట ను రహమాన్ రచించగా  శ్రీ కృష్ణ, రమ్య బెహరా ఎంతో హృద్యంగా ఆలపించారు. ప్రేయసి ప్రియుల మధ్య ప్రేమను వ్యక్తపరుస్తూ సాగే ఈ సాంగ్ యూత్ ని విశేషంగా  ఆకట్టుకునేలా ఉంది. దీంతో ఈ సాంగ్ కు యూట్యూబ్ లో మంచి వ్యూస్ లభిస్తున్నాయి.
 కేఎస్ రామారావు సమర్పణలో క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్ పై న‌టుడు కేఏ వల్లభ నిర్మిస్తున్న ‘వరల్డ్ ఫేమస్ లవర్’  చిత్రంలో 
యూత్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ హీరోగా న‌టిస్తుండ‌గా  విజయ్ సరసన క్యాథరీన్ థెరిస్సా, రాశి ఖన్నా, ఐశ్వర్య రాజేష్, ఇజా బెల్లె ఇలా హీరోయిన్స్  క‌నిపించి సంద‌డి చేయ‌నున్నారు.   క్రాంతి మాధవ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ , టీజర్ ఇప్ప‌టికే  ప్రేక్షకుల ముదుకు వచ్చి మంచి రెస్పాన్స్ సంపాదించుకున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker