Allజాతీయ వార్తలు

న్యూడ్‌ ఫొటోలతో విరాళాల సేక‌రిస్తున్నా…

2019 సెప్టెంబర్ 23న ఆస్ట్రేలియాలోని న్యూ సౌత్‌‌ వేల్స్‌, విక్టోరియా రాష్ట్రాల్లోని అటవీ ప్రాంతంలో కార్చిచ్చు  కు సాయంగా నిలిచేందుకు పలువురు ముందుకు వస్తున్నారు. ఈ క్రమంలోనే అమెరికాకు చెందిన సోషల్‌ మీడియా సెలబ్రిటీ కైలెన్‌ వార్డ్‌.. ఆస్ట్రేలియా విపత్తుఫై స్పందించి సాయంగా విరాళాలు సేకరించడానికి వినూత్న పద్ధతిని ఎంచుకుంది. కార్చిచ్చు విపత్తు సాయంగా విరాళాలు అందించేవారికి తన న్యూడ్‌ ఫొటోలను పంపుతానని వెల్లడించింది. విరాళాలు సేకరిస్తున్న సంస్థలకు కనీసం 10 డాలర్లు విరాళం అందజేసినట్టు తనకు నిర్దారణ చేస్తే.. వారికి తన న్యూడ్‌ ఫొటోలను పంపుతానని తెలిపారు. కైలెన్‌ పిలుపుకు విశేషమైన స్పందన వచ్చింది.

 చాలా మంది వారు పంపిన విరాళాలకు సంబంధించిన మేసేజ్‌లకు ఆమెకు షేర్‌ చేశారు. తన పిలుపుతో దాదాపు 700 వేల డాలర్లు(రూ. 5 కోట్లకు పైగా) విరాళాలు సేకరించగలిగానని ఆమె పేర్కొన్నారు. అయితే కైలెన్‌ విరాళాలు సేకరిస్తున్నట్టు ప్రకటించిన వెంటనే ఇన్‌స్టాగ్రామ్‌.. ఆమె అకౌంట్‌ను డీ ఆక్టివేట్‌ చేసింది. దీంతో ఆమె మరో అకౌంట్‌ను ప్రారంభించగా.. దానిని కూడా అందుబాటులో లేకుండా చూసింది. మరోవైపు కైలెన్‌ చేపట్టిన విరాళాలకు సంబంధించి.. కొంత డబ్బును ఆమె సొమ్ము చేసుకుంటందనే ఆరోపణలు వెల్లువెత్తాయి. అయితే వాటిపై ట్విటర్‌లో ఆమె స్పందిస్తూ.. ‘నేను విరాళాలను సొమ్ము చేసుకుంటున్నానని అనడంలో వాస్తవం లేదు. ప్రతి ఒక్కరు వారికి ఇష్టమైన చారిటీకి గానీ, సంస్థకు గానీ విరాళాలు అందజేస్తున్నారు. నాకు కేవలం అందుకు సంబంధించిన కన్ఫర్మేషన్‌ను పంపిస్తున్నార’ని చెప్పుకొచ్చింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker