Allజాతీయ వార్తలు
కరోనా దెబ్బకి షూటింగ్ బంద్

రాష్ట్రంలో విస్తరిస్తున్న కరోనా వైరస్ని దృష్టిలో ఉంచుకుని తెలంగాణ మరియు ఆంధ్ర షూటింగ్స్ నిలిపివేయాలని సినిమా లోకం నిర్ణయించింది. ఈ మేరకు తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్,మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్, ప్రొడ్యూసర్ కౌన్సిల్ సంయుక్తంగా మీడియా సమావేశం నిర్వహించాయి. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం థియేటర్స్, మాల్స్ బంద్ ప్రకటించిందని ఈ క్రమంలోనే షూటింగ్ నిలిపివేయాలని నిర్మాత మండలి నిర్ణయం తీసుకోవడం జరిగిందని తెలిపారు. నిర్మాతలకు ఇబ్బంది ఉన్నా సరే మా ఈ నిర్ణయానికి అందరూ సహకరించాలని కోరుతున్నామని, కోరారు. సోషల్ రెస్పాన్సిబులిటీ తో తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తో మేము ఏకీభవిస్తున్నాము, ప్రస్తుతం తెలంగాణలో జరుగుతున్న చిత్రీకరణలు ఒక్కొక్కటిగా ఆగిపోతున్నాయి. అభ్యంతరం లేని ఆంధ్ర ప్రాంతాల్లో షూటింగ్స్ జరుగుతున్నాయని, షూటింగ్స్ సమయంలో వందల మంది పాల్గొంటారు వారి ఆరోగ్య దృస్థ్య తెలంగాణలో ఎక్కడా షూటింగ్స్ జరగవని తెలియజేసాయి.
తెలుగు ఫిలింఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు నారాయణ దాస్ నారాంగ్, ప్రొడ్యూసర్ కౌన్సిల్ అధ్యక్షుడు సి.కళ్యాణ్, మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ యాక్టింగ్ అధ్యక్షుడు బెనర్జీ, సెక్రెటరీ జీవిత, ప్రొడ్యూసర్ కౌన్సిల్ సెక్రెటరీ లు దామోదర్ ప్రసాద్, ప్రసన్నకుమార్, నట్టి కుమార్, ట గుర్ మధు, రామా సత్యన్నారాయణ, సురేందర్ రెడ్డి, శ్యామ్ ప్రసాద్, కొమర వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.




