తెలంగాణముఖ్యాoశాలు

 సాహితికి 24 ఎకరాల భూమిని ఇచ్చింది ఫినిక్స్ కంపెనీ…..

 

 రెవిన్యూ అధికారుల అత్యుత్సాహం తో కన్వర్షన్...
2021లో ఉన్న యజమానుల పేర్లు .....2016లో ఎక్కడికి పోయాయి


 ఫ్రీ లాంచ్ పేరుతో 2000 వేల మందిని ఇబ్బందులు పెడుతూ డబ్బులు ఎగనామం పెట్టే యోచనలో ఉన్న సాహితీ ఇన్ఫ్రా కంపెనీ నా దగ్గర భూమి ఉన్నది ఆ భూమిలో కట్టడాలు నిర్మిస్తాను అని చెబుతున్న భూమి 24 ఎకరాలు సర్వేనెంబర్ 343 లో ఉంది నాలా కన్వర్షన్ చేసి వ్యవసాయ భూమి ని  ఇంటి నిర్మాణం చేపట్టే విధంగా భూమికి సంగారెడ్డి ఆర్డీవో 2016లో పర్మిషన్ ఇచ్చారు ఈ పర్మిషన్ చాలా త్వరగా ఎంతో ఉత్సాహంగా జరిగిందని చెప్పుకోవచ్చు నిజానికి ఫీనిక్స్ కంపెనీలో శ్రీకాంత్ బడ్గా అనే వ్యక్తి వైస్ చైర్మన్ గా ఉన్నారు. ఆయన నాలుగవ తేదీ జూలై 2016లో నాలా కన్వర్షన్ కోసం పటాన్చెరువు మండలంలో తాసిల్దార్ కు దరఖాస్తు చేసుకున్నారు వెంటనే తాసిల్దార్ ఏమాత్రం లేట్ చేయకుండా ఆరు జూలై 2016 ని తన ఒపీనియన్ ను ఆర్డిఓ సంగారెడ్డికి పంపించడం జరిగింది ఆర్డీవో సంగారెడ్డి లో  డి శ్రీనివాసరెడ్డి విధులు నిర్వహిస్తున్నారు తాసిల్దార్ ఇచ్చిన ఫైల్ ను చూసుకున్న ఆర్డిఓ ఎస్ టి ఓ కి ప్రొసీడింగ్ నెంబర్ A2/6956/2016,A2/6952/2016 ద్వారా ఒక కోటి 18 వేల రూపాయలు ఫీజుగా నిర్ణయించ గా 25 అక్టోబర్ 2016  దానిని చెల్లించారు. వెంటనే 26 అక్టోబర్ 2016 న నాలా కన్వర్షన్ పూర్తి చేసి సదర్ ఫైనాన్సు కంపెనీకి భూములు అప్పజెప్పారు ఇంత త్వరగా తాసిల్దార్ ఫైల్ కదపడం ఆర్డీవో ఫైల్ ను సకాలంలో మూడు నెలల లోపే కన్వర్షన్ను పూర్తిచేసి పంపించడం వెనుక ఎన్నో మతలబులు ఉన్నాయి ఇది ఇలా ఉంటే 2021లో ఆర్టిఏ యాక్ట్ ద్వారా అమీన్పూర్ కు సంబంధించిన భూముల విషయాలు తీసుకున్న నేపథ్యంలో ఆ భూములు రైతుల పేరు మీదే ఉన్నాయి అలాంటప్పుడు 2016లో నాలా కన్వర్షన్ అయితే 2021లో ఆర్టిఏ యాక్ట్ కింద అప్లై చేసిన వారికి పాత వారి పేర్లతో భూమి రికార్డులు ఇవ్వడం ఎంత నేరం. ఒకవేళ భూమి కొన్న రైతులు మోటివేషన్ చేసుకోకపోతే ఆ పేర్లు వచ్చే అవకాశం ఉండొచ్చు కానీ ఫినిక్స్ లాంటి పెద్ద కంపెనీలు భూమి కొన్న తర్వాత వారి పేర్లు మార్పిడి చేసుకోవడానికి ఏమాత్రం వెనుకాడవు 2016లో కన్వర్షన్ గురించి పెట్టిన దాదాపు అన్ని ఫైల్స్ సంవత్సరాలు తరబడి పెండింగ్లో ఉన్నప్పటికీ ఈ కంపెనీ ఫైల్స్ మాత్రం ఎలా తొందరగా బయటికి వచ్చాయి ఇలా ఒక ప్రశ్నకు ఇంకొక ప్రశ్న వేసుకుంటూ పోతే చివరికి బలి అయింది ఫ్రీ లాంచ్ లో కొన్న బాధితులు హెచ్ఎండిఏ పర్మిషన్ కోసం దరఖాస్తు చేసుకున్నామని చెప్పిన సాహితీ కంపెనీ వారికి ఎందుకు పర్మిషన్ రావడం లేదు అనే విషయాలు త్వరలో వస్తాయి కొంతమంది వ్యక్తులు చేసే పొరపాట్లు ఆశపడి ఒక్కరి కడుపు నిండడం కోసం చేసే పని వల్ల దాదాపు 1600 కుటుంబాలు రోడ్డు పడే పరిస్థితి ఏర్పడింది దీనికి కారణం రెవిన్యూ శాఖలో ఉద్యోగులు సర్వేనెంబర్ 343 బై 11 లో నాలుగు ఎకరాల భూమి ఉంది ఆ భూమి ఇప్పటికీ ముస్లింల సోదరుల పేరు మీద ఉంది 2016లో భూమి నాలా కన్వర్షన్ చేసుకున్నప్పుడు మరి ఇప్పటివరకు ఎందుకు పేరు మారలేదు దీనికి కారణం కోర్టు కేసులు, సిటీ సివిల్ కోర్టులో ఈ సర్వే నెంబర్ పై కోర్టు కేసు ఉంది ఈ విషయం ధరణిలో స్పష్టంగా కనబడుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker