Allసినిమాలు

అందం.. ఆకర్షణలో ముగ్ధ మందారాలు

సౌత్ లో అత్యంత ప్రభావవంతమైన కథానాయికలు ఎవరు? అందచందాలు.. నడవడిక.. గుణగణాలు.. తెలివితేటలతో పాటు యువతరాన్ని అమితంగా ఆకట్టుకునే కథానాయికలు ఎందరు ఉన్నారు అన్నదానిపై ప్రఖ్యాత చెన్నయ్ టైమ్స్ చేసిన పరిశోధనలో ఓ 30 మంది కథానాయికల పేర్లను వెలుగులోకి తెచ్చింది. ఈ  భామలంతా గొప్ప ప్రతిభావనులుగానూ సినీపరిశ్రమలో దూసుకుపోతున్నారు. అందం, అభినయం, ఆహార్యం, చిరునవ్వు.. ఇతరత్రా విభాగాల్లోనూ ఈ భామామణుల్లో దాగి ఉన్న గొప్పతనాన్ని దృష్టిలో ఉంచుకుని ముగ్ధ మందారాల జాబితాలో చేర్చారు.

వీళ్లందరిలో నంబర్ -1 స్థానాన్ని దక్కించుకున్న తారక ఐశ్వర్యా రాజేష్. ఈ బ్యూటీ తెలుగువారికి అంతగా సుపరిచితం కాకపోయనా తమిళనాట మాత్రం వెలుగులు విరజిమ్ముతోంది. 2010లో కథానాయికగా కెరీర్ ప్రారంభించిన ఈ బ్యూటీ 2019లోనే అరడజను పైగా తమిళ చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది. ధ్రువనక్షత్రం, ఇదు వేధాలం సొల్లు కథై, ఇదం పొరుల్ ఎవల్, వడ చెన్నయ్ 2 చిత్రాల్లో నటిస్తోంది. కార్తీ- మాధవన్ ల చిత్రంలో, సుందరమ్ ప్రొడక్షన్స్, గోపి నయనార్, సుశీందరన్ చిత్రాల్లో నటిస్తోంది. జీవీ ప్రకాష్  మణిరత్న ం నిర్మిస్తున్న చిత్రంలోనూ ఆడిపాడుతోంది. ఆ తర్వాత రెండో స్థానాన్ని తలైవి నయనతార ఆక్రమించింది. నయన్ నటించిన పలు చిత్రాలు 2019లో బ్లాక్బస్టర్ హిట్స్ సాధించాయి. కళ్లతోనే కోటి భావాలు పలికించే ఏకైక నాయికగా పాపులరైంది. అందుకే టైమ్స్ ఈ స్థానం కట్టబెట్టింది. ఆ తర్వాత మూడో స్థానంలో అక్కినేని కోడలు సమంత పేరు నిలిచింది. 2018లో సామ్ నటించిన యూటర్న్ ఇటు తెలుగు, అటు తమిళంలోనూ రిలీజైంది. తన నటనకు గొప్ప పేరొచ్చింది. సామ్ అందమైన నవ్వుకు లక్షలాది హృదయాలు జివ్వుమంటాయంటూ అరుదైన క్వాలిటీని టైమ్స్ ప్రకటించింది. 4- అనుకీర్తి వాస్ మిస్ వరల్ ఇండియా -2018. ఐదో స్థానంలో కీర్తిసురేష్ నిలిచింది. మహానటి చిత్రంలో సావిత్రిగా అభినయించి తెలుగు, తమిళ ప్రేక్షకుల మనసు దోచిన కీర్తి హోమ్ లీ గాళ్ గా పాపులరైంది.

యశిక ఆనంద్, త్రిష, ఓవియ, అదితీరావ్ హైదరీ, సాయిపల్లవి, రకుల్ ప్రీత్, ప్రియా భవానీ శంకర్, సయేషా సైగల్, కాజల్, ఎమీజాక్సన్, ఆండ్రియా జెరోమి, దివ్యదర్శిని, తమన్నా, రైజా విల్సన్, అమలాపాల్, రెజీన, రాశీఖన్నా, జనని అయ్యర్, అనుష్క శెట్టి, ఆత్మిక, శ్రుతిహాసన్, ఐశ్వర్యాదత్తా, బిందుమాధవి, డయాన ఎరప్ప, షెర్లిన్ సేథ్ పేర్లు వరుసగా జాబితాలో నిలిచాయి. వీళ్లలో త్రిష, అదితీరావ్, సాయి పల్లవి, రకుల్, రాశీఖన్నా, రెజీన వరుసగా సినిమాలు చేస్తూ బిజీ. అనుష్క, బిందుమాధవి సినిమాల పరంగా స్పీడ్ తగ్గించిన సంగతి తెలిసిందే. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker