తెలంగాణముఖ్యాoశాలు

విమానంలో ప్రయాణికుడికి అస్వస్థత…..చికిత్స చేసిన తెలంగాణ గవర్నర్ తమిళసై

విమానం లో ప్రయాణిస్తున్న ఓ ప్రయాణికుడు అర్థరాత్రి సమయంలో తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు.

 విమానం గాల్లో ఉన్న సమయంలో ప్రయాణికుడికి చెస్ట్ పెయిన్, ఇతర సమస్యలతో బాధపడ్డాడు.
 దీంతో అప్రమత్తం అయిన విమాన సిబ్బంది ఆ విమానంలో ఎవరైనా డాక్టర్‌లు ఉన్నారా అని అనౌన్స్ చేశారు.
 అదే విమానంలో ప్రయాణిస్తున్న గవర్నర్ తమిళసై వెంటనే స్పందించి ఆ ప్రయాణికుడికి ప్రాథమిక చికిత్స అందించారు. ప్రయాణికుడికి భరోసా ఇచ్చి ఉపశమనం కలిగించారు. వెంటనే కోలుకున్న ప్రయాణికుడు చికిత్స అందించిన గవర్నర్‌కు కృతజ్ఞతలు తెలిపాడు. ఇతర ప్రయాణికులు కూడా గవర్నర్‌ను ప్రసంసించారు. అలాగే సరైన సమయంలో స్పందించిన విమాన సిబ్బందిని గవర్నర్ అభినందించారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker