Allతెలంగాణముఖ్యాoశాలు

ఈసారి సనత్ నగర్ ఎమ్మెల్యే ఎవరో…

తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పడినప్పటి నుండి సనత్ నగర్ నియోజకవర్గం
నుండి 2018 లో మాత్రమే టిఆర్ఎస్ పార్టీ విజయం సాధించగలిగింది రాష్ట్రం
ఏర్పడిన తర్వాత 2014లో టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థికి 29వేల 14 ఓట్లు వచ్చాయి
20 18 లో 66,464 ఓట్లు వచ్చాయి రాబోయే ఎన్నికల్లో ఎవరు విజేత ఎవరు ఏం చేశారు
అభివృద్ధి జరిగిందా కనీసం ప్రజలను కష్టాల్లో ఆదుకున్నారా అనేది 2024 ఎన్నికల్లో
ముఖ్యంగా ఉండబోయే అంశం అధిక ధరలు నియోజకవర్గం అభివృద్ధి ఈ రెండిటి మీదే
ప్రజలు దృష్టి పెడతారని చెప్పొచ్చు అయితే 2008లో కాంగ్రెస్ పార్టీ 2004లో కాంగ్రెస్ పార్టీ
1999 లో తెలుగుదేశం పార్టీ 1994లో కాంగ్రెస్ పార్టీ 1992లో కాంగ్రెస్ పార్టీ 1989 లో కాంగ్రెస్
పార్టీ వచ్చాయి పార్టీలు ఎంత ప్రయత్నించినా పేద ప్రజల నాడి చదువుకున్న వారి నాడి
పట్టుకోవడం ఈసారి పార్టీల తరం కాదు ఎందుకంటే అధిక ధరలు, అధిక బ్యాంకు వడ్డీలు,
ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి వీటన్నిటిమీద ప్రజల దృష్టి ఈసారి ఎన్నికలపై పడనుంది. ప్రస్తుత
మంత్రి సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ 2014లో టిడిపి పార్టీ నుంచి పోటీ చేసి
56 వేల 475 ఓట్లు తెచ్చుకున్నారు పార్టీ మారి అదే నియోజకవర్గం నుండి టిఆర్ఎస్ పార్టీ తరఫున
పోటీ చేసి 66 వేల 464 ఓట్లు సాధించుకున్నారు. ఈ నియోజకవర్గంలో ఎక్కువసార్లు ఎమ్మెల్యేగా
ఎన్నుకోబడిన వ్యక్తి మర్రి శశిధర్ రెడ్డి ఈయన కాంగ్రెస్ పార్టీ నుండి 5 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నుకోబడ్డారు
ఎవరు కూడా ఒకటి రెండు సార్లు కంటే ఎక్కువసార్లు ఈ నియోజకవర్గం నుండి ఎన్నుకోబడలేదు అవకాశం
ఈసారి స్థానిక ఎమ్మెల్యే ప్రస్తుతం మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కు దక్కుతుందా వేచి చూడాల్సిందే
అయితే గతంలో ఇక్కడ ఎమ్మెల్యేగా పనిచేసిన మర్రి శశిధర్ రెడ్డి పోటీగా నిలబడి ఎన్నికల్లో పోటీని ఇస్తే
మరి ఫలితాలు ప్రజలు మారుస్తారా లేదా ప్రస్తుతం పని చేస్తున్న వారికే వారి యొక్క అభివృద్ధి చూసి పట్టం
కడతారా? సనత్ నగర్ నియోజకవర్గం నుండి 1978లో రామదాస్ అనే వ్యక్తి కాంగ్రెస్ పార్టీ నుండి మొట్టమొదటిసారిగా
ఎన్నికయ్యారు ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ నుంచి రెండుసార్లు వేరువేరు వ్యక్తులు ఎన్నికయ్యారు అక్కడినుండి
కాంగ్రెస్ పార్టీ తన ఆధిపత్యాన్ని చూపించుకుంటూ వచ్చింది ప్రస్తుతం టిఆర్ఎస్ పార్టీ సనత్ నగర్ నియోజకవర్గం
నుండి తలసాని శ్రీనివాస్ యాదవ్ మంత్రిగా ఉన్నారు కాబట్టి అభివృద్ధి చేసి ప్రజలకు తోడునీడగా ఉండి మరి వారి
ఆశీస్సులు పొందుతారు మరి ఇంకేదైనా ప్రయత్నం చేస్తారా తన కుమారుడిని వచ్చే ఎన్నికల్లో సనత్ నగర్
నియోజకవర్గం నుండి బరిలో దించాలని ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది అయితే అది ఎంత మాత్రం ఫలిస్తుంది
ఈ నియోజకవర్గంలో దాదాపు పది ప్రాంతాలు సిటీలో ఉన్నాయి సనత్ నగర్ అమీర్పేట్ ఎస్ ఆర్ నగర్ పద్మారావు నగర్
మొండ మార్కెట్ బల్కంపేట్ పాన్ బజార్ జనరల్ మార్కెట్ బేగంపేట్ రాష్ట్రపతి రోడ్డు ఇవి ఈ నియోజకవర్గంలో ఉన్న
ప్రదేశాలు మొత్తం ఇక్కడి ఓట్లు రెండు లక్షల 20వేల తొమ్మిది వందల అరవై తొమ్మిది ఓట్లు ఎవరికి 75 వేల ఓట్లు దాటితే
వారు విజయం సాధించినట్టని అనుకోవాల్సి వస్తుంది మరి ఈసారి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఏం చేస్తారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker