Allజాతీయ వార్తలు
భర్తకు బాస్ కాబోతున్న పోలీస్ అధికారిని

సినిమాలలో హీరో అయిన భర్త పై అధికారం చెలాయించే అధికారిణిగా అనూహ్యంగా ఆతని భార్య హీరోయిన్ వచ్చి తన సత్తా చూపుతుండటం చాలా సార్లు చూసాం. ఈ కోవలో పోలీస్ భార్య తదితర సినిమాలు చెప్పొచ్చు. అది నిజ జీవితంలో అలానే జరిగితే… ఆశ్చర్యమనిపించక మానదు. కానీ మీరు వింటున్నది నిజమే… ఇందుకు సంబంధించిన వివరాలలోకి వెళితే… యూపీలో జరిగిన పోలీసు బదిలీల్లో అనుకోకుండా జరిగిన ఈ మార్పు ఇప్పుడు ఆసక్తిగా మారింది. . ఓ ఐపీఎస్ అధికారిణి ఏకంగా తన భర్తకు బాస్ కాబోతుండటం ఇప్పుడు ఆ రాష్ట్ర పోలీస్ శాఖలో పెద్ద చర్చకు తెరలేపింది.
2014 నాగాలాండ్ క్యాడర్‌కు చెందిన ఐపీఎస్ అధికారి వృందా శుక్లాను లఖ్‌నపూ నుంచి బదిలీ నోయిడాలోని మహిళా యూనిట్‌కు డీసీపీగా నియమిస్తూ ఉత్తర్వులు వెలువరించింది అదే సమయంలో 2016 బ్యాచ్‌కు చెందిన ఆమె భర్త అంకుర్ అగర్వాల్ నోయిడాలో ఎస్పీగా చేస్తున్న ఆయనకు అదే ప్రాంతంలో పదోన్నతి ఇస్తూ అడిషినల్ పోలీస్ కమిషనర్‌గా నియమించింది. దీంతో డీసీపీగా ఉన్న తన భార్య వద్ద ఆయన ఏసీపీగా పనిచేయాల్సి రావటం విశేషం.




