
ఒంగోల్ లో రాత్రి ఎనిమిది గంటలకు కరెంట్ పోయిందంటే కచ్ఛితంగా మర్డరే..అనే వాయిస్ ఓవర్ తో ప్రారంభమైన క్రాక్ టీజర్ ఆద్యంతం ఉత్కఠభరితంగా సాగింది. మాస్ మహారాజా రవితేజ, బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో రూపొందుతోన్న చిత్రం క్రాక్. డాన్‌శీను, బలుపు చిత్రాల తర్వాత వీరిద్దరి కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న హ్యాట్రిక్ చిత్రమిది. శివరాత్రి సందర్భంగా క్రాక్ సినిమా టీజర్ విడుదల చేశారు చిత్ర యూనిట్. అప్పిగా, తుప్పిగా, నువ్వు ఎవరైతే నాకేంట్రా డొప్పిగా..అంటూ తనదైన మ్యానరిజం తో రవితేజ చెప్పే డైలాగ్ సినిమాపై అంచనాలను పెంచింది.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో.. చిత్ర దర్శకుడు గోపీచంద్ మలినేని మాట్లాడుతూ – ” మహా శివరాత్రి సందర్భంగా విడుదల చేసిన టీజర్ కి అన్ని వర్గాల నుండి మంచి రెస్పాన్స్ వస్తోందని అన్నారు. వేసవి సెలవుల్లో ప్రేక్షకులు ఆస్వాదించేలా సమ్మర్ స్పెషల్ గా మే 8న ఈ సినిమాని విడుదల చేస్తున్నాం అని చెప్పారు. తెలుగు రాష్ట్రాల్లో జరిగిన యథార్థ ఘటనలను ఆధారంగా చేసుకుని అన్నీ వర్గాల ప్రేక్షకులను మెప్పించేలా అన్ని ఎలిమెంట్స్‌తో ఈ సినిమాను తెరకెక్కించినట్టు డైరెక్టర్ గోపీచంద్ మలినేని తెలిపారు.
మీరు ఇప్పుడు టీజర్ లో చూసింది చాలా తక్కువ . రవితేజ నుండి మీరు ఆశించే అన్ని అంశాలు ఇంకా చాలా చాలా ఎక్కువగా సినిమాలో ఉంటాయని అన్నారు. మా యూనిట్ కి మంచి కమర్షియల్ సినిమా అవుతుందని ఆశిస్తున్నాం. మా డి ఒ పి విష్ణు అధ్బుతమైన విజువల్స్ అందించారు. టీజర్ లాగే మూవీలో కూడా తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అదిరిపోతుంది. సినిమా కచ్చితంగా ఆకట్టుకుంటుంది అని నమ్ముతున్నాం” అన్నారు. సముద్రఖని, వరలక్ష్మి శరత్‌కుమార్ లు సినిమాకి ప్రత్యేకంగా నిలవనున్నారని వివరించారు.
ఈకార్యక్రమంలో నిర్మాత బి. మధు, కో ప్రొడ్యూసర్ అమ్మిరాజు, డి ఓ పి జి.కె విష్ణు, నిర్మాత సుధాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.




