ఫ్రీ లాంచ్ వ్యవహారంలో పోలీసులు కీలక పాత్ర

సాహితీ ఇన్ఫ్రా పేరుతో ఫ్రీ లాంచ్ ఆశ చూపి దాదాపు 1500 మంది దగ్గర 40 లక్షలు చొప్పున డబ్బులు వసూలు చేసి మూడు సంవత్సరాలు అయింది. అడగటానికి వస్తే కనపడరు, ఫోన్ చేస్తే ఫోన్ తీయరు, ఆఫీస్ కి వస్తే సెక్యూరిటీ చేత బయట నుంచో పెడతారు, కానీ డబ్బులు వసూలు చేసిన సమయంలో ఉన్న వ్యక్తులు ఇప్పుడు ఒక్కరు కూడా కనుచూపుమేర కానరావడం లేదని సాహితి బాధితులు వాపోతున్నారు. ఆఫీసుకు వెళ్లి వారితో మాట్లాడదామంటే పోలీసులు ఆఫీసులోకి పోనియ ఇవ్వకుండా బయటనే ఆపేస్తున్నారు. సాహితీ ఆఫీస్ ముందల ధర్నా చేస్తుంటే మేము ఉన్నామంటూ జూబ్లీహిల్స్ పోలీసులు వారిని అక్కడ నుంచి పంపించివేసి, వారితో సాహితీ చైర్మన్ తో మీకు ఒక ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేస్తామని, ఆ సమావేశంలో మాట్లాడొచ్చని చెప్పి పంపించిన పోలీసులు మరి ఇప్పుడు ఎక్కడ ? ఫ్రీ లాంచ్ వ్యవహారంలో జూబ్లీహిల్స్ పోలీసులు కీలక పాత్ర వహిస్తున్నట్లు తెలుస్తోంది. డబ్బులు తీసుకొని మోసం చేశాడు అని పోలీస్ స్టేషన్కు వచ్చి చెప్పినా కేసు బుక్ చేయకుండా నిందితుడితో మంతనాలు జరిపి, అతన్ని తప్పించే వ్యవహారం చేస్తున్న పోలీసులది ఎంతవరకు న్యాయం .హైదరాబాదులో జరుగుతున్న ఇంత పెద్ద ఆందోళన చూసి కూడా ఒక్క పోలీసు అధికారికి కూడా మనసు కరగలేదా. సిసిఎస్ పోలీసులు కేసు నమోదు చేసుకొని నిందితుడిని పిలిచి మాట్లాడి పంపించి వేశారు. ఏం జరిగింది, న్యాయం జరుగుతుందా, అన్యాయం జరుగుతుందా? పోలీసులు ఆడుతున్న ఈ దాగుడుమూత వ్యవహారం ఎప్పటికీ బయటపడుతుంది. ధర్నా చేస్తున్నారని సర్ది చెప్పి బయటికి పంపించిన ఆ పోలీసులు ఎక్కడ ? లక్ష్మీనారాయణ ఎక్కడ? అసలు ఉన్నాడా విదేశాలకు పంపించారా, ఏం జరుగుతుంది అనేది ఏ ఒక్క బాధితులకు కూడా సమాచారం లేదు . ఆర్థిక నేరాలకు పాల్పడిన లక్ష్మీనారాయణను పోలీసులు ఎందుకు రిమాoడ్ కు పంపటం లేదు . ఎందుకు బాధితుల మధ్యలో పెట్టి మాట్లాడించడం లేదు. ఎంతో కష్టపడి డబ్బులు కూడా పెట్టి సొంత ఇంటి కల నెరవేర్చుకుందామని, ఫ్రీ లాంచ్ చౌకగా దొరికింది కదా అని డబ్బులు కట్టి మోసపోయిన ఈ బాధితులకు న్యాయం జరుగుతుందా, లక్ష్మణ్ నారాయణ ముందుకు వస్తాడా, సిసిఎస్ పోలీసులు విచారణ చేస్తున్నామని చెప్తున్నారు .ఏమి విచారణ చేస్తున్నారు, ఎక్కడ విచారణ చేస్తున్నారు, అసలు చేస్తున్నారా లేదా, అనేది చాలామంది బాధితులకు ప్రశ్నగానే మిగిలిపోతుంది. తప్పు చేసిన వారిని శిక్షించే సత్తా ఉన్న పోలీసులే చడి చప్పుడు లేకుండా ఉండిపోవటం వెనుక ఆంతర్యం ఏమిటి?



