Allఆంధ్రప్రదేశ్

దిల్లీకి జనసేన అధినేత పవన్‌


అమరావతి:
రాజధాని రైతుల ఆందోళనలు, స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చిచేందుకు పార్టీ ముఖ్యనేతలతో పవన్‌ కల్యాణ్‌ ఇవాళ సమావేశమయ్యారు. సమావేశం కొనసాగుతుండగానే..హస్తిన పర్యటనకు సంబంధించిన సమాచారమందింది. దీంతో ఆయన హుటాహుటిన గన్నవరం విమానాశ్రయానికి చేరుకుని అక్కడి నుంచి దిల్లీ బయల్దేరారు. నిన్న సాయంత్రం అమరావతి రైతులతో సమావేశం సందర్భంగా పవన్‌ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌లో రాజధాని అంశానికి సంబంధించి ఏర్పడ్డ అనిశ్చిత పరిస్థితులను కేంద్రమే తొలగించాలని డిమాండ్‌ చేశారు. శాసనసభలో రాజధానిపై తీర్మానం చేయడం కన్నా ముందే కేంద్రం జోక్యం చేసుకోవాలన్నారు. ఈనేపథ్యంలోనే రాజధాని అంశంపై కేంద్ర ప్రభుత్వంలోని పెద్దలతో సమావేశమయ్యేందుకు పవన్‌ దిల్లీ వెళ్లారని తెలుస్తోంది. ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్‌షాతో పాటు ఇతర ముఖ్య నేతలలో ఎవరితో పవన్‌ భేటీ అవుతారనే అంశంపై మాత్రం ఇంకా స్పష్టత రాలేదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker