ఆంధ్రప్రదేశ్తెలంగాణముఖ్యాoశాలు

సాహితి వ్యవహారంలో ఏపీ మంత్రులు ఎంపీలు…..

.గోవిందా గోవిందా అంటూ………… సాహితీ ఎండి లక్ష్మీనారాయణ

గోవిందా గోవిందా అంటూ సాహితీ ఎండి లక్ష్మీనారాయణ దాదాపు 1500 మందికి గుండు చేశారు ప్రసాదం పేరిట
తెలుగు రాష్ట్రాల్లో ఉన్న పెద్దలకు డబ్బులు పంపిణీ చేసి పోలీసు వారికి ప్రసాదం పెట్టి డబ్బులు ఇచ్చిన వారికి
గుండు చేసుకోమన్నట్టు ఆయన తీరు ఉందిబాధితులకు న్యా యం చేస్తానని మాట ఇచ్చిన సాహితీ
ఇన్‌ఫ్రాస్టక్చ ర్ ఎండి లక్ష్మినారాయణ మరోసారి మోసం చే శాడు.
సంగారెడ్డి జిల్లాలో ని అమీన్‌పూర్‌లోని వెం చర్‌లో ప్రీలాంచ్ పేరుతో పలువురు బాధితుల వద్ద నుంచి డబ్బులు తీసుకుని
ఇళ్లు కట్టిస్తామని మో సం చేసిన విషయం తెలిసిం దే. దాదాపుగా 1, 500 మంది వద్ద నుంచి రూ.400 కోట్ల వరకు వ సూలు
చేసిన సాహితీ ఇన్‌ఫ్రా వెంచర్స్ ఎండి లక్ష్మినారాయణ డబ్బులు కట్టి మూడేళ్లు అవుతున్నా ఇళ్లు కట్టివ్వ లేదు. దీంతో
బాధితులు హైదరాబాద్ రోడ్డు నంబర్ 36లోని సంస్థ కార్యాలయానికి వచ్చి గత నెల 30వ తేదీన ఆందోళన చేశారు.
ఇందులో 4,300 ప్లాట్లను విక్రయిస్తామని ప్రకటించారు. 2019, జూన్‌లో ప్రాజెక్ట్ ప్రీ లాంచ్ పేరుతో కార్యక్రమం
ఏర్పాటు చేసి ప్లాట్లను విక్రయించింది. ఇందులో ప్లాట్లను కొనుగోలు చేసిన వారికి 2023, మార్చి వరకు
ఇళ్లను నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చారు. వెంచర్‌లో నిర్మించే డబుల్ బెడ్ రూమ్ ఇళ్లకు రూ.25లక్షలు,
ట్రిపుల్ బెడ్ రూం ఇళ్లకు రూ.35లక్షలు వసూలు చేశారు. డబ్బులు కట్టి ఏళ్లు అవుతున్నా ఎలాంటి పనులు
చేపట్టకపోవడంతో బాధితులు ఆందోళనకు దిగారు. ఈ క్రమంలోనే డబ్బులు కట్టిన వారికి న్యాయం చేస్తానని ఆగస్టు 6వ
తేదీన మాదాపూర్‌లోని వీ కన్వెన్షన్‌కు సాయంత్రం 4.30 గంటలకు రావాలని ఆహ్వానం పంపారు. ఇది నిజమని
భావించిన బాధితులు తమ వద్ద ఉన్న ఆధార్ కార్డులు, సేల్ డీడ్స్, ఇతర పత్రాలు తీసుకుని వచ్చారు. కాని మీటింగ్
సమయానికి రెండు గంటల ముందు సమావేశం రద్దు అయిందని మెసేజ్‌లు రావడంతో ఖంగుతిన్నారు. అయినా
కూడా పెద్ద ఎత్తున మాదాపూర్ వీ కన్వెన్షన్‌కు వచ్చారు. కన్వెన్షన్ నిర్వాహకులు అసలు తమ హాల్‌ను ఎవరూ బుక్
చేయలేదని, ఇక్కడ ఎలాంటి సమావేశం నిర్వహించడం లేదని స్పష్టం చేయడంతో బాధితులు అవాక్కయ్యారు.
మరోసారి తమను సాహితీ ఎండి లక్ష్మినారాయణ మోసం చేశాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు కన్పించకుండా
పారిపోయాడని ఆరోపించారు.సాహితి వ్యవహారంలో కొంతమంది ఏపీ మంత్రులు ఎంపీలు తెలంగాణలో కేవలం
ఇద్దరు మంత్రులు మాత్రమే లక్ష్మి నారాయణ కు అండగా ఉన్నట్టు తెలుస్తోంది ఈ వ్యవహారం మొత్తం చూస్తుంటే
2019లో తన కంపెనీలో ఉన్న కొంతమంది ప్రముఖులను బయటకు పంపించి వేరే కంపెనీలలో వారిని డైరెక్టర్లుగా
చేర్చి ఇక్కడ వచ్చిన సొమ్మును తిరిగి ఆయా కంపెనీలో సర్దుబాటు చేసుకుని చివరకు తాను మోసపోయానని
చెప్పేటందుకు సిద్ధమవుతున్నారు సాహితీ ఎండి లక్ష్మీనారాయణ కుటుంబం 30వ తేదీ తర్వాత వారు విదేశాలకు
వెళ్ళినట్టు పోలీసులను రాజకీయ నాయకులను ప్రసన్నం చేసుకొని టెన్షన్ పడకుండా ఆయన ఉన్నట్టు వారి కంపెనీ
ఉద్యోగుల ద్వారా సమాచారం అందుతుంది ఆరవ తేదీ రమ్మన్న వ్యక్తి ఎక్కడికి వెళ్లారు ఎందుకు రాలేదు పోలీసులు
ఎందుకు ఎంటర్ కావడం లేదు. ఏ పోలీసులను అడిగిన మాకేం సంబంధం లేదన్నట్టు కాలం గడుపుతున్నారు తప్ప
జరిగిన తప్పుకు ఎవరు పరిష్కారం చూపడం లేదు ఎన్ని రోజులు ఇలా

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker