క్షమించాలని జన సైనికులకు వేడుకోలు….నారాయణ

కోనసీమ జిల్లా బడుగువానిలంక బాధితుల పరామర్శకు బుధవారం బయల్దేరిన నారాయణ బృందాన్ని చెముడులంక వద్ద చిరంజీవి, పవన్ అభిమానులు అడ్డుకున్నారు. నారాయణ బృందం బడుగు వానిలంకకు వెళ్లిపోవడంతో జనసైనికులు మరో పడవలో అక్కడకు చేరుకున్నారు. క్షమాపణ చెప్పేవరకు కదలనిచ్చేది లేదని పట్టుబట్టారు. నారాయణ స్పందిస్తూ…తాను మాట్లాడింది తప్పేనని, అలా మాట్లాడకుండా ఉండాల్సిందని చేతులు జోడించి నమస్కరించడం తో శాంతించారు. అనంతరం నారాయణ బృందం వరద ప్రభావిత ప్రాంతాల పర్యటనను రద్దు చేసుకుని పశ్చిమ గోదావరి జిల్లాకు వెళ్లిపోయింది. అమలాపురం గడియార స్తంభం సెంటర్‌లో చిరంజీవి అభిమానులు నారాయణ చిత్రపటానికి అన్నం తినిపించి వినూత్న రీతిలో నిరసన తెలిపారు. నరసాపురం పట్టణంలోని శివాలయం సెంటర్ వద్ద నారాయణ ఉన్నారని తెలుసుకుని అక్కడకు చేరుకున్న చిరు అభిమానాలు.. ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.నారాయణపై ఫిర్యాదులు నమోదయ్యాయి.



