ఆంధ్రప్రదేశ్
పట్టాభి ఇంటికి పోలీసులు.. మీడియాను చూసి ఏం చేశారంటే……..

టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్
ఇంటికి వన్‌టౌన్ పీఎస్ పోలీస్ అధికారులు వెళ్లారు. 41 ఏ కింద నోటీసులు
ఇచ్చేందుకు యత్నించారు. అయితే మీడియా ప్రతినిధులను చూసి నోటీసులు
ఇవ్వకుండానే వెనుతిరిగారు. ఈ ఘటనపై స్పందించిన పట్టాభిరామ్ వన్ టౌన్
పోలీసులు తనకు 41 ఏ కింద నోటీసులు ఇస్తున్నట్లు తెలిపారు. తాను ఇంటి వద్దే
ఉన్నానని, నోటీసులు ఇవ్వొచ్చని ఆయన సూచించారు. తనపై ఇప్పటికే చాలాసార్లు
భౌతికదాడులు జరిగాయని.. మీడియా ఉంటే నోటీసులు ఇవ్వడానికి ఎందుకు
జంకుతున్నారని పట్టాభి ప్రశ్నించారు.




