
‘బాహుబలి’, ‘ప్రతిరోజూపండగే’ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న సత్యరాజ్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న తమిళ చిత్రం‘తీర్పుగళ్ విర్కపడుమ్`ను హనీబి క్రియేషన్స్ పతాకంపై మీరాసాహిబ్ రాథర్ `ఎమర్జెన్సీ` పేరుతో తెలుగులో విడుదల చేస్తున్నారు. కాగా ఈ మూవీ ఫస్ట్ లుక్ ని దర్శకుడు మారుతి తన ట్విట్టర్ ద్వారా మంగళవారం విడుదల చేశారు.
ఎడ్జ్ ఆఫ్ ద సీట్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ తమిళ చిత్రానికి స మొదటి సారిగా అగ్రశ్రేణి కెమెరాలతో యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరించడంవిశేషం. ధీరన్ దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ చిత్రంలో సత్యరాజ్ కుమార్తెగా స్మృతి వెంకట్ నటిస్తోంది. కాగా ఇప్పుడు ఈ చిత్ర డబ్బింగ్ శరవేగంగా పూర్తయింది. నిర్విరామంగా దాదాపు 12 గంటల పాటు సత్యరాజ్ డబ్బింగ్ చెప్పి అందరిని ఆశ్చర్యపరిచాడు



