All

పోస్ట‌ల్ జాబ్స్‌కి అప్లై చేశారా? త‌పాలా ఉద్యోగులకు కొత్త నిబంధ‌న‌లు

తెలుగు రాష్ట్రాల్లో త‌పాలాశాఖ వారి ఉద్యోగాల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ ప‌డింది.  పోస్ట్ మ్యాన్‌, గ్రామీణ్ డాక్ సేవ‌క్స్ వీళ్ళ గురించి తెలియ‌ని వాళ్ళుండ‌రు. రెండు రాష్ట్రాల్లో ధ‌ర‌ఖాస్తు గ‌డువు పూర్త‌వ‌గా ఇక ఫ‌లితాల కోసం ఎదురు చూపులు. ఇక ఈ డిపార్ట్‌మెంట్ వారు తాజాగా పోస్ట్‌మ్యాన్, గ్రామీణ్ డాక్ సేవక్స్ ద్వారా ఇన్సూరెన్స్ పాలసీలను కూడా విక్రయించాలని భావిస్తోంది. ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ (ఐపీపీబీ) ఇన్సూరెన్స్ పాలసీల విక్రయానికి పోస్ట్‌మ్యాన్, గ్రామీణ్ డాక్ సేవక్స్ నియామకానికి ఇన్సూరెన్స్ రెగ్యులేటర్ ఐఆర్‌డీఏఐ అంగీకరించింది.

ఐఆర్‌డీఏఐ తాజా నిబంధనల ప్రకారం పోస్ట్‌మ్యాన్, గ్రామీణ్ డాక్ సేవక్స్ (జీడీఎస్) పాయింట్ ఆఫ్ సేల్స్ పర్సన్‌ అనే బాధ్యతలు కూడా నిర్వహించనున్నారు. ఇండియా పోస్ట్‌కు దేశవ్యాప్తంగా 1,55,000 పోస్టాఫీసులు ఉన్నాయి. అలాగే 3 లక్షలకు పైగా గ్రామీణ్ డాక్ సేవక్స్, పోస్ట్‌మ్యాన్‌లు పనిచేస్తున్నారు.

పోస్ట్‌మ్యాన్‌లు, గ్రామీణ్ డాక్ సేవక్స్ దేశంలోని మారుమూల ప్రాంతాల్లో కూడా విధులు నిర్వర్తిస్తూ ఉంటారు. దీంతో వీరి ద్వారా ఇన్సూరెన్స్ ప్రొడక్టులను విక్రయిస్తే.. గ్రామాల్లోని వారికి పాలసీలు అందుబాటులోకి వస్తాయి. దీంతో ఇన్సూరెన్స్ విస్తరణ పెరుగుతుంది’ అని ఐఆర్‌డీఏఐ అభిప్రాయపడింది.

ఐఆర్‌డీఏఐ ఐపీపీబీ బ్యాంక్‌కు సంబంధించి పోస్ట్‌మ్యాన్, గ్రామీణ్ డాక్ సేవక్స్‌ను ఇన్సూరెన్స్ సెల్లర్లుగా నియమించుకునేందుకు మార్గదర్శకాలు విడుదల చేసింది. అయితే దీని కోసం బ్యాంక్ దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. ఒకవేళ ఐఆర్‌డీఏఐ దీనికి ఓకే చెబితే.. అప్పుడు బ్యాంక్ ఇన్సూరెన్స్ ప్రొడక్టల విక్రయానికి నియమించుకున్న పోస్ట్‌మ్యాన్, గ్రామీణ్ డాక్ సేవక్స్ వివరాలను ఐఆర్‌డీఐకు తెలియజేయాల్సి ఉంటుంది.

ఐపీపీబీ బ్యాంక్ సంబంధిత ఇన్సూరెన్స్ కంపెనీల బీమా పాలసీలను కస్టమర్లకు విక్రయించుకోవచ్చు.
ఐపీపీబీ బ్యాంక్ ఒకవేళ పోస్ట్‌మ్యాన్, గ్రామీణ్ డాక్ సేవక్స్‌ను ఇన్సూరెన్స్ ప్రొడక్టులను విక్రయించేందుకు నియమించుకోవాలని భావిస్తే.. అప్పుడు ఇది పలు రూల్స్‌ను అనుసరించాల్సి ఉంటుంది. దీనికోసం ప్ర‌త్యేక శిక్ష‌ణ ఇవ్వ‌బ‌డుతుంది. అలాగే దీనికి సంబంధించిన స‌ర్టిఫికెట్‌, డైలీ ట్రాన్స‌క్ష‌న్ల‌ను, కోడ్ ఆఫ్ కండక్ట్, కేవైసీ నిబంధనలు, ఫిర్యాదుల పరిష్కార కేంద్రం ఏర్పాటు వంటి వ‌న్నీ తెలుసుకుని చేరాల్సి ఉంటుంది. అయితే ఈ నిబంధ‌న‌లు అన్నిటికి ఓకే అనుకుంటే పోస్టులు రెఢీగా ఉన్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker