Allఆంధ్రప్రదేశ్

వైసీపీ కార్యకర్తలపై పోలీస్ కేసు పెట్టిన రోజా..!

వైసీపీ ఎమ్మెల్యే రోజా సొంత పార్టీ కార్యకర్తల పైనే కేసులు పెట్టించారు. సొంత నియోజకవర్గం నగరిలో ఆదివారం ఆమెకు తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. చిత్తూరు జిల్లా పుత్తూరు మండలం కేబీఆర్‌పురంలోకి రోజాను రానివ్వకుండా సొంత పార్టీ కార్యకర్తలే అడ్డుకున్నారు. కారును కదలనివ్వకుండా అడ్డుకున్నారు. ఈ ఘటనపై అసహానానికి గురైన రోజా… సొంతపార్టీ కార్యకర్తలపైనే కేసు పెట్టించారు. 

చిత్తూరు జిల్లా పుత్తూరు మండలం కేబీఆర్‌పురంలో ఎమ్మెల్యే రోజా ఆదివారం పర్యటించారు. పర్యటన ముగించుకుని వెళ్లిపోతుండగా వైసీపీ కార్యకర్తలు అడ్డుపడ్డారు. వైసీపీ నాయకులను పట్టించుకోకుండా టీడీపీ నుంచి కొత్తగా పార్టీలోకి వచ్చిన వారికి రోజా ప్రాధాన్యం ఇస్తున్నారంటూ వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో రోజాకి కోపం వచ్చింది. పుత్తూరులోని పోలీస్ స్టేషన్‌లో తన అనుచరులతో రోజా కేసు నమోదు చేయించారు. 30 మంది కేబీఆర్‌పురం వైసీపీ కార్యకర్తలపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై వైసీపీ అధిష్టానం ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker