
శ్రీమతి అనుశ్రీ సమర్పణలో ఆర్ఆర్ఆర్ ప్రొడక్షన్స్ & జేకే క్రియేషన్స్ బ్యానర్ లో జీడీ.కాశీ నిర్మాతగా తీసిన సినిమా MM OF. సీనియర్ నటుడు జేడీ.చక్రవర్తి దర్శకత్వం పర్యవేక్షణలో బెనర్జీ, అక్షత, మనోజ్ నందన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్ర ట్రైలర్ హైదరాబాద్ లో ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ విడుదల చేసారు.
ఈ సందర్భంగా రామ్ గోపాల్ వర్మ మాట్లాడుతూ… MM OF ట్రైలర్ చూశాక ఇంత ఫాస్ట్ సినిమా ఇంత బాగా తీయచ్చా అనిపించింది. నేనే చాలా వెనుక బడి ఉన్నాననిపించింది. ఈ సినిమా ట్రైలర్ చాలా కొత్తగా, థ్రిల్లింగ్‌గా అనిపించింది. జేడీ చక్రవర్తి చాలా టాలెంటెడ్ పర్సన్ ఇలాంటి సరి కొత్త కాన్సెప్ట్ లతో మరిన్ని సినిమాలు చేయాలని కోరుకుంటూ యూనిట్ సభ్యులు బెస్ట్ విషెస్ తెలుపుతున్నాను అన్నారు.
నటుడు బెనర్జీ మాట్లాడుతూ… చాలా రోజుల తరువాత జెడితో కలసి నటించా, , మంచి పాత్ర ఇచ్చినందుకు ధన్యవాదాలు. MMOF సినిమా కొత్త కాన్సెప్ట్ తో వస్తోంది, ఈ సినిమా తప్పకుండా అందరికి నచ్చుతుంది అన్నారు. ఆర్జీవి దర్శకత్వం వహించిన దాదాపు ఆయన అన్ని సినిమాల్లో నేను నటించాను. తెలుగు సినిమాను కొత్త ఒరవడి తీర్చి దిద్దిన వ్యక్తి వర్మ. ఆయన చేతుల మీదుగా ట్రయిలర్ విడుదల కావటం ఆనందంగా ఉంది.
హీరో మనోజ్ నందం మాట్లాడుతూ… ఈ సినిమాలో జేడీ చక్రవర్తితో కలసి నటించడం మర్చిపోలేనిది. ఒక కొత్త తరహా పాత్రతో మీ ముందుకు వస్తున్నాను. మా MMOF సినిమాను మీరంతా ఆదరించాలని కోరుతున్నానని అన్నారు.
శివ నాగేశ్వరరావు మాట్లాడుతూ… వర్మ ని అనుకరించాలని అనుకున్నా అది అసాధ్యం. కానీ ఆతని శిష్యుడిగా జీడీ చక్రవర్తి మేధాసంపత్తు ఉన్న నటుడు, MMOF కొత్తగా రూపొందించాడు. ట్రైలర్ కొత్తగా ఉంది, ఆసక్తిని కలిగించేలా సినిమా ఉంటుందని ఆశిస్తున్నా అని అన్నారు.




